E-Paper
Advertisement

Vijay Devarakonda : నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు… రౌడీ హీరో స్టేట్మెంట్

Vijay Devarakonda : నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు… రౌడీ హీరో స్టేట్మెంట్
Advertisement

Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నేడు బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా సిఐడి ఆఫీసుకు (CID Office)హాజరైన సంగతి తెలిసిందే. నేడు విచారణకు హాజరు కావాలి అంటూ ఈయనకు గతంలో అధికారులు నోటీసులు అందజేశారు ఈ క్రమంలోని విచారణకు విజయ్ దేవరకొండతో పాటు మరొక నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా సిఐడి అధికారులు దాదాపు గంటన్నరకు పైగా విజయ్ దేవరకొండను విచారించి పలు ప్రశ్నలు అడుగుతూ ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారని తెలుస్తోంది. ఇలా విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

ఇకపై ఎలాంటి ప్రమోషన్స్ చేయను..

తాను ఏ 23 అనే గేమింగ్ యాప్ మాత్రమే ప్రమోట్ చేశానని అది బెట్టింగ్ యాప్ కాదని విజయ్ దేవరకొండ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇకపై గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని సిఐడికి విజయ్ దేవరకొండ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఈడీ అధికారుల ముందు హాజరైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సిఐడి అధికారుల ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ విచారణ స్టేట్మెంట్స్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

మూడు బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటల్స్..

Advertisement

ఇక వీరిద్దరితోపాటు బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ కూడా బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా విచారణకు హాజరయ్యారు గతంలో ఈమె కూడా ఇది విచారణకు హాజరు కాగా తాజాగా సిఐడి విచారణకు హాజరయ్యారు. ఇలా బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీగా డబ్బు సంపాదించారని ఆ డబ్బుతో ఈమె ఏకంగా మూడు బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ కూడా నిర్మించిందని తెలుస్తోంది. సిరి హనుమంత్ గోవిందా 365 అనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ ద్వారా ఎంత డబ్బు గెల్చుకున్న టాక్స్ ఉండదంటూ ఈమె పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

సిఐడి విచారణకు సిరి హనుమంతు..

Advertisement

ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి సంబంధించిన అన్ని ఆధారాలను సిఐడి సేకరించింది. ఇక ఈ విచారణలో భాగంగా సిరి హనుమంత స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో భాగంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్ల పై కూడా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. గతంలో వీరంతా విచారణకు హాజరయ్యారు అయితే ఈ కేసును సిఐడి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరోసారి విచారణకు రావాలని నోటీసులు అందిన నేపథ్యంలో సెలబ్రిటీలు ఈ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు సిరి హాజరు కావడమే కాకుండా ఇకపై ఎలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లను నిర్వహించనని తెలిపినట్టు సమాచారం. ఇక ఈమె యూట్యూబర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సిరి హనుమంత్ కెరియర్ పరంగా  ఎంతో బిజీగా ఉన్నారు.

 

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×