BigTV English

Holi:హోలీ నాడు ఏ రంగు దుస్తులు ధరించాలి?

Holi:హోలీ నాడు ఏ రంగు దుస్తులు ధరించాలి?

Holi:కొత్త పెళ్లైన జంటలు హోలీ పండుగను జరుపుకునే విషయంలో జాగ్రత్తులు తీసుకోవాలి. హోలికా దహన్‌ను చూడకూడదు. ఇలా చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, కొత్తగా పెళ్లి అయినవారు .హోలీ ఆడటానికి ఒకరోజు ముందు హోలికా దహన్ జరుగుతుంది. ఈసారి మార్చి 7న హోలికా దహన కార్యక్రమం ఉంది. హోలికా దహన మంటలను కొత్తగా పెళ్లి అయినవారు చూడకూడదని అంటారు.


గణేష్ పూజ
హోలీ పండుగ రోజు గణేశుడిని పూజించి, గులాబీ రంగును పూసి, గణేశుడికి ఇష్టమైన స్వీట్లు నైవేద్యంగా సమర్పించి హోలీ పండుగను జరుపుకోవాలి. అప్పుడు గణేశుడు సంవత్సరం అంతా జీవితం విఘ్నాలు లేకుండా అన్ని పనులు నిర్విఘ్నంగా సాగేలా దీవిస్తాడు

అత్తింట్లో హోలీ వద్దు
మత విశ్వాసాల ప్రకారం, పెళ్లి తర్వాత మొదటి హోలీని కొత్త జంటలు తమ అత్తమామల ఇంట్లో జరుపుకోకూడదు. ఇలా చేసుకుంటే ఇంటి సంతోషాలను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. నూతన వధూవరులు తమ అత్తమామల ఇంట్లో మొదటి హోలీ ఆడటం అశుభకరం. ఒకవేళ ఈనియమాన్ని పాటించకపోతే సంబంధం కూడా చెడిపోతుంది. భాగస్వామికి ఏదైనా అశుభం జరగవచ్చని నమ్మకం.


ఆ దానాలు వద్దు
కొత్తగా పెళ్లైన మహిళలు తమకు వివాహంలో కానుకగా వచ్చిన వస్తువులను ఎవరికీ దానం చేయకూడదు. హోలికా దహనం రోజున తంత్ర-మంత్రం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటారు. అందుకే ఆ టైంలో వస్తువులు ఇతరులకు ఇవ్వడం వల్ల నెగెటివ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఏ రంగు బట్టలు?
హోలీ రోజున నల్లని బట్టలు ధరించకూడదు.నల్లని దుస్తులు ధరిస్తే అశుభం భావిస్తారు. నలుపు అనేది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఈ రోజు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రంగును ధరించడం మానుకోవాలి. అంతే కాకుండా పెళ్లయిన తర్వాత తొలిసారి హోలీ జరుపుకునే స్త్రీలు తెల్లని బట్టలు ధరించకూడదు. వాటికి బదులుగా కొత్త వధువు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించవచ్చు.

మొక్క నాటాలి
హోలీ రోజున, ఇంటి లోపల, ఇంటి బయట, పచ్చని చెట్లను, మొక్కలను నాటాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆనందం సంవత్సరం అంతా ఉంటుందని సూచిస్తున్నారు. ఇంట్లోని దోషాలను తొలగించడంతోపాటు, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి ఈపని చేయండి.

Holi day : హోలీ రోజు భార్యాభర్తలు ఈ పని చేస్తే

Gajalakshmi : హోలీ తర్వాత గజలక్ష్మి రాజయోగం

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×