E-Paper
Advertisement

UP: భార్యను ముక్కలుగా నరికి.. వాటర్ ట్యాంకులో దాచిన భర్త

UP: భార్యను ముక్కలుగా నరికి.. వాటర్ ట్యాంకులో దాచిన భర్త
Advertisement

UP: మర్డర్‌లు చేయడం.. ముక్కలుగా నరకడం.. శరీరభాగాలను వేరువేరుగా పడేయడం. ఇటువంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. చికెన్ కట్ చేసినంత ఈజీగా.. మనుషులను హత్యచేసి ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. ఢిల్లీ శ్రద్ధావాకర్ ఘటన నుంచి హైదరాబాద్‌లో నవీన్ హత్య వరకు అన్నీ ఇలానే జరిగాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ముక్కులుముక్కలుగా నరికాడు. అనంతరం ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంకులో బాడీపార్ట్స్‌ను దాచి పెట్టాడు. రెండు నెలల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

తఖాత్‌పుర్‌కు చెందిన పవన్ ఠాకూర్ అనే వ్యక్తికి సీసీటీవీ ఫిట్టింట్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో భార్యపై పవన్‌కు అనుమానం కలిగింది. ఆమె ప్రవర్తన బాగోలేకపోవడంతో మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినా కూడా ఆమె వినకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

Advertisement

ఈక్రమంలో రెండు నెలల క్రితం తన కొడుకులను బంధువుల ఇంటికి పంపించాడు. అనంతరం భార్యను హత్య చేసి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత వాటిని మూటకట్టి ఇంటిపైనున్న వాటర్ ట్యాంక్‌లో దాచిపెట్టాడు. చుట్టుపక్కల వాళ్లకి, బంధువులకి అనుమానం రాకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చాడు.

ఇంతలో అతను చేసిన పనే పోలీసులకు దొరికిపోయేలా చేసింది. దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో పోలీసులు పవన్ ఇంటిలో తనిఖీ చేయగా.. వాటర్ ట్యాంక్‌లో మహిళ శరీర భాగాలు కనిపించాయి. దీంతో పవన్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటకొచ్చింది. ఈ మేరకు పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×