Diwali 2025: దీపావళి లేదా హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. అయితే.. ప్రతి సంవత్సరం తిథుల విషయంలో వచ్చే మార్పుల కారణంగా.. పండుగను ఏ రోజు జరుపుకోవాలనే దానిపై కొంత గందర గోళం నెలకొంటుంది. 2025 సంవత్సరానికి సంబంధించి.. దీపావళిని అక్టోబర్ 20వ తేదీనా లేక 21వ తేదీనా జరుపుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంది.
అమావాస్య తిథి:
దీపావళి పండగను హిందూ పంచాంగం ప్రకారం.. ఆశ్వయుజ బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథి రోజున జరుపు కోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ అమావాస్య రాత్రి సమయంలోనే లక్ష్మీ దేవి పూజను అత్యంత ముఖ్యంగా భావించి నిర్వహిస్తారు.
ఈ ఏడాది అమావాస్య తిథి:
అమావాస్య తిథి ప్రారంభం: అక్టోబర్ 20 సోమవారం సాయంత్రం 3:44 గంటలకు అమావాస్య తిథి ప్రారంభం అవుతుంది.
అమావాస్య తిథి ముగింపు: అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 5:54 గంటలకు తిథి పూర్తవుతుంది.
పండితులు ఏం చెబుతారు ?
సాధారణంగా హిందూ పండగలను సూర్యోదయ తిథిని బట్టి నిర్ణయించినప్పటికీ.. దీపావళి పండగ విషయంలో నియమం కాస్త భిన్నంగా ఉంటుంది. దీపావళి ప్రధాన వేడుక అయిన లక్ష్మీ పూజను సూర్యాస్తమయం తర్వాత , అర్ధ రాత్రికి ముందు ఉండే ప్రదోష కాలంలో నిర్వహిస్తారు.
అక్టోబర్ 20, 2025న సాయంత్రం అమావాస్య తిథి ప్రారంభమై.. ఆ రోజే ప్రదోష కాలం, నిశిత కాలం కలుస్తుంది. కాబట్టి.. శాస్త్రాల ప్రకారం.. అక్టోబర్ 20 సోమవారం రోజున దీపావళి పండగను, లక్ష్మీ పూజను జరుపుకోవడం అత్యంత శుభప్రదమని, సరైందని పండితులు చెబుతున్నారు.
Also Read: ఏ కన్ను అదిరితే మంచిది ? పురాణాల్లో ఏముంది ?
లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం (అక్టోబర్ 20):
దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 2025 దీపావళికి లక్ష్మీ పూజ నిర్వహించడానికి శుభ సమయం..
లక్ష్మీ పూజ ముహూర్తం: రాత్రి 7:08 నుంచి 8:18 వరకు లక్ష్మీ పూజలు నిర్వహించవచ్చు.
వ్యవధి: 1 గంట 11 నిమిషాలు.
ప్రదోష కాలం: సాయంత్రం 5:46 నుంచి రాత్రి 8:18 వరకు ప్రదోష కాలంగా చెబుతారు.
అమావాస్య తిథి రాత్రి పూట ఆ రోజున లక్ష్మీ పూజకు ప్రదోష కాలం లభిస్తుంది కాబట్టి.. ఈ ఏడాది దీపావళి పండగను అక్టోబర్ 20, సోమవారం నాడు జరుపుకోవడమే సరైంది. అక్టోబర్ 21వ తేదీన అమావాస్య తిథి ఉదయం 5:54 గంటలకే ముగుస్తుంది. కాబట్టి ఆ రోజున రాత్రి పూజకు తిథి ఉండదు. కాబట్టి.. అక్టోబర్ 20న దీపాలు వెలిగించి, లక్ష్మీదేవిని పూజించి.. ఈ వెలుగుల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చు.