Nagarjuna 100: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) త్వరలోనే తన 100వ సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు. ఆర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నాగార్జున తన సినీ కెరియర్ లో100 వ సినిమా కావడంతో ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఈ సినిమాకు “లాటరీ కింగ్”(Lottery King) అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ టైటిల్ విషయంలో ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వినపడుతోంది. ఈ సినిమా పొలిటికల్ డ్రామా(Political Drama)గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది. ఇప్పటివరకు నాగార్జున ఎన్నో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ పొలిటికల్ డ్రామాగా ఇప్పటివరకు నాగార్జున ఏ సినిమాలో నటించలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా రావడమే కాకుండా ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయంలో కూడా నటించబోతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో మరొక స్టార్ హీరో క్యామియో పాత్ర కూడా ఉండబోతుందని సమాచారం.
పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పాత్ర కోసం మరొక స్టార్ హీరోని కూడా ఇందులో భాగం చేయబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. మరి క్యామియో పాత్రలో కనిపించబోతున్న ఆ హీరో ఎవరు ఏంటి అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ నటి టబు(Tabu )నటించబోతుందని వార్తలు కూడా బయటకు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల టబు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో నయనతార ఈ సినిమా అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తోంది.
నాగార్జునకు జోడిగా నయనతార?
నయనతార ప్రస్తుతం సీనియర్ హీరోల సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే నాగార్జున కెరియర్ లోనే ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్న ఈ సినిమా కోసం మేకర్స్ నయనతారను సంప్రదించగా ఆమె భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు అన్నింటికి స్పష్టత రావాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇక నాగార్జున ఇటీవల కాలంలో కుబేర, కూలీ సినిమాలలో క్యామియో పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఈయన బిగ్ బాస్ 9 కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే తన 100 వ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందులో నాగచైతన్య అఖిల్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.
Also Read: Salaar Re release: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..మళ్ళీ థియేటర్ లోకి సలార్ సీజ్ ఫైర్!