BigTV English

Chewing Gum: చూయింగ్ గమ్ తింటున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Chewing Gum: చూయింగ్ గమ్ తింటున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Advertisement

Chewing Gum: చూయింగ్ గమ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నోటి నుంచి చెడు వాసన రాకుండా, తాజాగా ఉండటానికి చూయింగ్ గమ్ తినే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉంటే చూయింగ్ గమ్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నోట్లో లాలాజలం ఉత్పత్తి జరుగుతుందని ఫలితంగా ఒత్తిడి కూడా తగ్గుతుందని అంతే కాకుండా నోటికి మంచి వ్యాయామం అవుతుందని అంటున్నారు. ఇంతకీ చూయింగ్ గమ్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఇదిలా ఉంటే.. కేవలం గత ఏడాదిలోనే 1.74 ట్రిలియన్లకు పైగా గమ్ స్టిక్స్ తయారు చేసారని అంచనా. సగటు అమెరికన్ సంవత్సరానికి దాదాపు 300 చూయింగ్ గమ్ పీస్‌లను నములుతారట.

చూయింగ్ గమ్ వల్ల కలిగే ప్రయోజనాలు:
చూయింగ్ గమ్ తినడం వల్ల చాలామందికి ఉపయోగాలు ఉన్నాయి.


శ్వాస తాజాదనం : ఇది నోటి దుర్వాసనను తొలగించి.. శ్వాసను తాజాగా ఉంచుతుంది.

దంతాల శుభ్రత: పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలను తొలగించడానికి ఇది సహాయ పడుతుంది.

మానసిక ప్రశాంతత: కొంతమందికి ఒత్తిడిని తగ్గించడానికి.. ఆకలి కోరికలను నియంత్రించడానికి ఇది తోడ్పడుతుంది.

లాలాజలం ఉత్పత్తి: చూయింగ్ గమ్ నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఈ లాలాజలం బ్యాక్టీరియా, ప్లాక్‌తో పోరాడటానికి సహాయ పడుతుంది.

దంతక్షయం : జిలిటాల్ అనే స్వీటెనర్‌ను కలిగి ఉన్న కొన్ని రకాల గమ్స్ దంతక్షయాన్ని నివారించడానికి కూడా సహాయ పడుతుంది.

చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే నష్టాలు:
చూయింగ్ గమ్ ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీనిని అధికంగా నమలడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది.

దవడ కండరాల అలసట: చూయింగ్ గమ్ నమిలేటప్పుడు మన దవడ కండరాలకు వ్యాయామం జరుగుతుంది. శరీరంలోని ఏ ఇతర కండరాల సమూహంలాగే.. అధికంగా, తరచుగా గమ్ నమలడం వల్ల ఈ కండరాలు అలసిపోయి, నొప్పిగా మారే ప్రమాదం కూడా ఉంటుంది.

టెంపరోమాండిబ్యులర్ డిస్ఫంక్షన్ : చూయింగ్ గమ్‌ను ఎక్కువగా నమలడం వల్ల టెంపరోమాండిబ్యులర్ జాయింట్లు ఒత్తిడికి గురై, పక్కకు జరుగుతాయి. ఈ సమస్యను టెంపరోమాండిబ్యులర్ డిస్ఫంక్షన్ అని అంటారు. దవడలో షాక్ అబ్జార్బర్‌లుగా పనిచేసే మృదులాస్థి క్షీణించడం లేదా శారీరక ఒత్తిడి కారణంగా టెంపరోమాండిబ్యులర్ డిస్ఫంక్షన్ సమస్య వస్తుంది.

Also Read: తరచూ వ్యాధుల బారిన పడుతున్నారా ? ఈ టిప్స్ మీ కోసమే !

టెంపరోమాండిబ్యులర్ డిస్ఫంక్షన్ లక్షణాలు: 

నమిలేటప్పుడు ఇబ్బంది.

దవడను తెరవడానికి లేదా మూయడానికి ఇబ్బంది.

నోరు తెరిచినప్పుడు పొప్పింగ్ లేదా క్లిక్ శబ్దాలు రావడం.

చెవిపోటు , తలనొప్పి

దీర్ఘకాలిక తలనొప్పి, మైగ్రేన్: దీర్ఘకాలికంగా చూయింగ్ గమ్ నమలడం వల్ల ముఖ కండరాలు బిగుతుగా మారతాయి. ఇది దీర్ఘకాలిక తలనొప్పికి దారితీస్తుంది. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. పిల్లలు టీనేజర్లలో చూయింగ్ గమ్ నమలడం మైగ్రేన్‌లతో ముడిపడి ఉందని తేలింది.

నొప్పి నివారణ, పరిష్కార మార్గాలు:
చూయింగ్ గమ్‌ను మితంగా నమలడం వల్ల పెద్దగా సమస్య ఉండదని చాలామంది అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ.. మీకు తల, మెడ లేదా దవడ నొప్పిగా అనిపిస్తే.. ఆ అలవాటుకు విరామం ఇవ్వాలని అంతే కాకుండా కండరాలకు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని తెలిపారు.

ఉపశమనం కోసం: యాంటీ-ఇన్ఫ్లమేటరీ మందులు తీసుకోవడం, నొప్పి ఉన్న ప్రాంతంలో వెచ్చని కాపడం పెట్టుకోవడం, మెత్తని ఆహారం తీసుకోవడం వంటివి నొప్పిని తగ్గించడంలో సహాయ పడతాయి.
నొప్పి కొనసాగితే.. వెంటనే మీ పంటి డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.

Related News

Blood Sugar: షుగర్ చెక్ చేసే సమయంలో.. ఎక్కువ మంది చేసే పొరపాట్లు ఇవేనట !

Egg Storage: కోడి గుడ్లు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి ? త్వరగా పాడవ్వకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Heart-healthy diet: హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గించే ఆహారాలు.. డాక్టర్లకే షాక్ ఇచ్చే ఫలితాలు..

Immune System: తరచూ వ్యాధుల బారిన పడుతున్నారా ? ఈ టిప్స్ మీ కోసమే !

Poppy Seeds: గసగసాలతో గంపెడు లాభాలు.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Hypersomnia: అతిగా నిద్ర పోతున్నారా ? కారణాలు తెలుసుకోకపోతే కష్టమే !

Health Deit: ఆరు అద్భుత ఆరోగ్య సూత్రాలు.. ప్రతిరోజూ ఈ ఆహారాలు తింటే సమస్యలు దూరం!

Big Stories

×