Bomb Threat to Ilaiyaraaja: తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపింది. ఈ మధ్య కాలంలో వరుసగా సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. నెల రోజుల్లోనే హీరోయిన్ నయనతార, త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు కూడా బాంబు థ్రెట్ కాల్ వచ్చింది. చెన్నైలోని టీ–నగర్‌లోని ఆయన స్టూడియోకి ఈ బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇళయారాజా స్టూడియోతో పాటు పలు విదేశీ రాయబార కార్యాలయాలకు కూడా ఈ తరహా బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. కాగా చెన్నైలోని టీ నగర్లో ఉన్న ఇళయరాజా స్టూడియోకు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. డీజీపీ ఆఫీసుతో పాటు ఇళయరాజ స్టూడియోకి మెయిల్ ద్వారా ఈ బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్తో స్టూడియోకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో దాన్ని ఫేక్ బెదిరింపులుగా అధికారులు తేల్చారు. అయితే తరచూ ఈ బాంబు బెదిరింపు వస్తుండటపై అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
దీని వెనుక ఎవరూ ఉన్నారు? ఏ ఉద్దేశంతో ఇలాంటి ఫేక్ థ్రెట్ కాల్స్ చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే మెయిల్ అడ్రస్ నుంచి గత కొన్ని వారాలను ప్రముఖులు బాంబు థ్రెట్ మెయిల్స్ వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత నెలల వారం రోజుల గ్యాప్‌లోనే హీరోయిన్ త్రిష, నయనతార, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఇళయరాజా స్టూడియో పాటు విదేశీ రాయబారా కార్యాలయాలకు కూడా బాంబు థ్రెట్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే గతంలోనూ హీరో అజిత్, రజనీకాంత్ ఇంటితో పాటు ప్రముఖ రాజకీయ నేతల ఇళ్లకు కూడా ఈ బెదిరింపులు వచ్చాయి. అయతే అవన్నీ ఫేక్ బెదిరింపులే అని తేలడంతో అంత రీలాక్స్ అయ్యారు.
Also Read: Bigg Boss 9: బాత్‌రూంలోకి వెళ్దాం రా… కెమెరాల ముందు కంటెస్టెంట్స్ ఆరాచకం..