Maruthi on Bunny Vas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో బన్నీ వాసు ఒకరు. గీత ఆర్ట్స్ 2 బన్నీ వాసు సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. కేవలం సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా అద్భుతమైన సినిమాలు ఏ లాంగ్వేజ్ లో ఉన్నా కూడా దానిని తెలుగులోకి డబ్బింగ్ చేసి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటారు.
గతంలో కాంతారా సినిమాను అలానే డబ్బు చేసి మంచి లాభాలు పొందారు. కేవలం కాంతారావు మాత్రమే కాకుండా చాలా సినిమాలను డబ్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేశారు. అయితే బన్నీ వాస్ మళ్లీ సెపరేట్ గా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మిత్రమండలి అనే సినిమాను నిర్మించారు బన్నీ వాసు. ఈ సినిమా ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది అని ట్రైలర్ చూస్తేనే అర్థమయిపోయింది.
ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా నలుగురు దొంగ నా కొడుకులు స్టోరీ. అలానే నా లైఫ్ లో కూడా కొంతమంది దొంగ నా కొడుకులు ఉన్నారు అని బన్నీ వాసు చెప్పాడు. నా లైఫ్ లో దొంగ నా కొడుకులు ప్రస్తావన వస్తే ఎస్ కే ఎన్, అలానే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి అనకూడదు మారుతి అని ఇంకో ఇద్దరు పేర్లు కూడా చెప్పాడు బన్నీవాస్. వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి బన్నీ వాసు ఈ మాటలు చెప్పాడు అనేది వాస్తవం. ఆ మాటలకు తాజాగా యూరప్ లో రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మారుతి కూడా స్పందించాడు.
Adyaksha @TheBunnyVas. Meeru Mammalni emanna, Memu mee Success Mathrame korukuntaam. 😉
Ee #MithraMandali Cinema Mathabu la Veligipovaali, Rocket la Doosukipovaali 🚀💥💥
Enjoy this hilarious entertainer in theatres! With the support of DNK Sangam and the audience's blessings,… pic.twitter.com/Payn98q289
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) October 15, 2025
మా దొంగ నా కొడుకులు సంఘం అధ్యక్షుడు. బన్నీ వాసు ఒక సినిమాను తీశాడు. సినిమా పేరు మిత్రమండలి. దొంగ నా కొడుకులు స్టోరీ ఆ సినిమా. అందుకే మేము శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ వీడియోని విడుదల చేస్తున్నాం.
ఆ సినిమా మంచి సక్సెస్ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోటీలో దిగుతున్నాడు. అద్భుతంగా చిచ్చుబుడ్డి లాగా వెలగాలి అని కోరుకుంటున్నాను. రాకెట్ల దూసుకుపోవాలి.
డబ్బులు వస్తే ఒక్కడివే తినేయకుండా మాకు కూడా గిఫ్టులు ఇవ్వాలి అని చెప్పి మా దొంగ నా కొడుకులు సంఘం అధ్యక్షుడు బన్నీ వాసుకి బెస్ట్ విషెస్ యూరప్ నుంచి తెలియజేస్తున్నాము అని మారుతి వీడియో విడుదల చేశాడు.
Also Read: Peddi – Fouji – Ntr Neel : మూడు భారీ ప్రాజెక్టులపై ఒకేసారి క్లారిటీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్