Vijay Antony:తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. ఈ మధ్యకాలంలో ఇతర భాషా నటులు చేసిన సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. అలా ఆ హీరోలు వాళ్ళ సొంత భాషతో పాటు టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో విజయ్ ఆంటోనీ కూడా ఒకరు.. బిచ్చగాడు సినిమాతో సినీ అభిమానులకి దగ్గరైన విజయ్ ఆంటోని.. టాలీవుడ్ లో కూడా చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. అలా విజయ్ ఆంటోనీ నటించే చాలా తమిళ సినిమాలు తెలుగులో కూడా విడుదలై హిట్స్ గా నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ ఆంటోని నటించిన కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.. అదే భద్రకాళి మూవీ.. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన భద్రకాళి మూవీ సెప్టెంబర్ 19న విడుదలైంది.ఈ సినిమా తెలుగులో భద్రకాళి పేరుతో.. తమిళంలో శక్తి తిరుమగన్ అనే పేరుతో విడుదలైంది.అయితే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా థియేటర్లలో రన్ టైం ముగియడంతో ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మరి భద్రకాళి మూవీని ఎక్కడ చూడొచ్చు.. ఏ ఓటీటిలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుంది ?అనేది ఇప్పుడు చూద్దాం..
also read:Bigg Boss 9 Floara: పెళ్లి వద్దు.. ప్రియుడే ముద్దు.. సంచలన కామెంట్స్ చేసిన ఫ్లోరా!
అరుణ్ ప్రభు డైరెక్షన్లో విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన భద్రకాళి మూవీని.. విజయ్ ఆంటోని తన సొంత బ్యానర్ అయినటువంటి విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పై నిర్మించారు. అలా సెప్టెంబర్ 19 విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..భద్రకాళి మూవీ జియో సినిమా హాట్ స్టార్ లో ఈనెల 24 నుండి తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.. ఇక భద్రకాళి మూవీ థియేటర్లలో విడుదలైన ఐదు వారాలలోనే ఓటీటిలో విడుదల కాబోతుంది.
విజయ్ ఆంటోని భద్రకాళి మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమాలో విజయ్ రాజకీయాల్లో ఉండే ఓ మీడియేటర్ రోల్ లో పోషించారు..ఈ సినిమాలో రాజకీయ నాయకుల స్వార్ధాలు ఎలా ఉంటాయి.. వాళ్లు ఎలాంటి కుట్రలు చేస్తారు అనే అంశాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.. అలా పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన భద్రకాళి మూవీకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది..పైగా రాజకీయాలు అంటే ఇష్టం ఉన్నవారు కచ్చితంగా ఒక్కసారైనా భద్రకాళి సినిమాని చూడవచ్చు. థియేటర్లలో చూడడానికి వీలు కాని ప్రేక్షకులు ఈనెల 24 నుండి జియో హాట్ స్టార్ లో చూసేయచ్చు. భద్రకాళి మూవీ లో సునీల్ కృపలానీ, తృప్తి రవీంద్ర, వాగై చంద్రశేఖర్ ,సెల్ మురుగన్, మాస్టర్ కేశవ్ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. అలాగే భద్రకాళి మూవీని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు.
విజయ్ ఆంటోని రాబోయే సినిమాల విషయానికి వస్తే.. విజయ్ ఆంటోని జోషు సేతురామన్ డైరెక్షన్లో లాయర్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే సెంతిల్ కుమార్ డైరెక్షన్ లో ఖాకీ అనే సినిమా కూడా చేస్తున్నారు..ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి.