E-Paper
Advertisement

Peddi – Fouji – Ntr Neel : మూడు భారీ ప్రాజెక్టులపై ఒకేసారి క్లారిటీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్

Peddi – Fouji – Ntr Neel : మూడు భారీ ప్రాజెక్టులపై ఒకేసారి క్లారిటీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్

Peddi – Fouji – Ntr Neel : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మైత్రి మూవీ మేకర్ సంస్థ ఒకటి. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. కేవలం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా మిడ్ రేంజ్ సినిమాలు కూడా ఈ సంస్థ నిర్మిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ బ్యానర్ లో పనిచేస్తున్న విషయం తెలిసిందే.

ఒక ప్రాజెక్టు వెళ్లిపోయిన తర్వాత ఇంకో అద్భుతమైన ప్రాజెక్టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రెడీ అవుతూనే ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో అంచనాలతో రిలీజ్ చేసిన ప్రాజెక్టులన్ని విడుదల అయిపోయాయి. ఇప్పుడు స్టార్ హీరోలు మళ్ళీ భారీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. భారీ ప్రాజెక్ట్స్ లో ఎక్కువ శాతం మైత్రి మూవీ మేకర్స్ లో నిర్మించబడటం ఆశ్చర్యం.

ఒకేసారి క్లారిటీ 

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ఫౌజీ. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీతారామం వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి అని చెప్పాలి.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మార్చి 27న విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పటినుంచో అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సినిమాను చెప్పిన డేట్ కు తీసుకొచ్చే పనిలోనే ఉంది చిత్ర యూనిట్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా డ్రాగన్. ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించక పోయినా కూడా, ఒక జపాన్ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడిన మాటలు బట్టి ఈ సినిమా టైటిల్ ఇదే అని అందరికీ ఒక అవగాహన వచ్చేసింది.

ఇకపోతే ఈ మూడు సినిమాలు కూడా ఖచ్చితంగా 2026లో విడుదల కానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ మరియు రవి కన్ఫర్మ్ చేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్ 

మూడు భారీ ప్రాజెక్టు గురించి చెప్పారు కానీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మరో ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం కాంబినేషన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది.

మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలన్నీ కూడా ఈ సినిమా మీద విపరీతంగా ఉన్నాయి. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Bigg Boss 9 : బిగ్ బాస్ కు అంతరాయం, దిక్కు తోచని స్థితిలో యాజమాన్యం

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×