BigTV English

Shiva Temple : సముద్ర గర్భంలో ఉండేలా శివాలయం ఎక్కడుంది?

Shiva Temple : సముద్ర గర్భంలో ఉండేలా శివాలయం ఎక్కడుంది?
Shiva Temple


Shiva Temple : మనదేశంలో అంతు చిక్కని రహస్యాలు ఉన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో వింతలు విశేషాలు ఉన్న ఆలయాల్లో శివాలయాలు చాలా ఉన్నాయి. అందులోను గుజరాత్ లో శివుడి ఆలయాలకి లెక్కలేదు. సముద్ర తీరాన శివాలయాలకు కొన్నే ఉన్నాయి. భావ్ నగర్ కు 23 కిలోమీటర్ల దూరంలోని అరేబియా తీరాన కొలియాక్ గ్రామంలో సముద్రం మధ్యలో ఉన్న శివాలయం ప్రత్యేకమైంది.
ఈదేవాలయం చూడటానికి కాస్త భయానకంగా ఉంటుంది. సముద్ర గర్భంలో ఉండే పరమేశ్వరుడ్ని దర్శిస్తే సకల పాపాలు, దోషాలు సమసిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శివుడ్ని నిష్కలంక్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు.

అయితే ఈ సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు ఈ ఆలయాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చూడటానికి వీలు ఉండదు. ఉదయం సముద్రంలో పెద్ద ఎత్తున అలలు రావడంతో ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది .ప్రతి రోజు పది గంటల సమయంలో సముద్రంలో అలల క్రమంగా తగ్గుతూ ఉంటాయి. ఆ సమయంలో జెండాతో ఉన్నటు ఒక స్తూపం ఐదు శివలింగాలు దర్శనమిస్తాయి. ఎంతో కష్టమైనా భక్తులు ఈ ఆలయంలో పూజలు చేస్తూనే ఉంటారు. అమావాస్య, పౌర్ణమి, రోజుల్లో భక్తులు ఇక్కడ విశేష సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మహా శివరాత్రి పండుగ నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మహా శివరాత్రి పండుగ సమయంలో భోళాశంకరుడికి పెద్దఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు


ఇంట్లో ఎవరైనా పెద్ద వాళ్ళు మరణిస్తే వారి అస్తికలు సముద్ర గర్భంలో కలిపితే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. మధ్యాహ్న సమయంలో సముద్రం కొంతభాగం వెనక్కి వెళ్లడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. సైన్స్ కూడా అందని విషయం ఏంటంటే ఈ ఆలయం సముద్ర గర్భంలో ఏ విధంగా కట్టారనే రహస్యం సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.

Related News

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

God Idols: ఇంట్లో ఉంచకూడని దేవుని ఫోటోలు ఏవో తెలుసా..? ఆ తప్పు మీరు అసలు చేయకండి

Big Stories

×