BigTV English

Rukmini Kalyanam : రుక్మిణి కళ్యాణ పారాయణం ఎందుకు చేయాలి?

Rukmini Kalyanam : రుక్మిణి కళ్యాణ పారాయణం ఎందుకు చేయాలి?
Rukmini Kalyanam


Rukmini Kalyanam : కొంతమందికి ఎంత ప్రయత్నించినా పెళ్లి కాదు. కొందరికి మంచి సంబంధం వచ్చి మధ్యలో ఆగిపోతుంటాయి. ఇంకొంతమంది ఎన్ని సంబంధాలు చూసినా సరైన మ్యాచ్ రాక బాధపడతుంటారు. చాలా మంది రాజీపడి ఎవరిని ఒకర్ని పెళ్లి చేసుకుని తర్వాత ఇబ్బంది పడుతుంటారు.అలాంటి వారురుక్ష్మిణి కళ్యాణ పారాయణం చేస్తే వివాహనికి సంబంధించిన సమస్యలు తొలగిపోయాయి. అమ్మాయైనా, అబ్బాయైనా సరే పారయణం చేయచ్చు. రుక్మిణి పారాయం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలంటోంది శాస్త్రం. గురువారం లేదా శుక్రవారం రోజున మాత్రమే ఇది ప్రారంభించాల్సి ఉంటుంది. ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసి అప్పుడు పారాయణం ప్రారంభించాలి. జంటగా ఉండే దేవీదేవతల ఫోటోలు మాత్రమే ఉండి పూజ చేయాలి. సీతారాములు, శ్రీకృష్ణుడు రుక్మిణి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి , పార్వతి పరమేశ్వరులు ఉన్న పటాలను పూజించినా మంచిదే. తర్వాత విష్ణుమూర్తికి షోడశోపచార పూజను నిర్వహించాలి.

షోడశోపచారలో పది ఉపచారాలు పూర్తి చేసిన తర్వాతే రుక్మిణి కళ్యాణ లేఖను చదవడం ప్రారంభించాలి. తర్వాత దూపం దీపం నైవేద్యం సమర్పిస్తే పూజ పూర్తి అయినట్టే అవుతుంది. పాయసం, కర్జూరం, బెల్లం, ఆవు పాలు ఇలా ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చని శాస్త్రం చెబుతోంది. 41 రోజులు శ్రద్ధపెట్టి లీనమై చదివితే తప్పకుండా కళ్యాణం అవుతుంది. ఎంత భక్తితో శ్రద్ధతో చేస్తే అంత త్వరగా మంచి ఫలితం వస్తుందని శాస్త్రం వివరిస్తోంది. అబ్బాయి అయినా అమ్మాయినా సరే వారే సంకల్పం చెప్పుకుని శ్రద్దగా పూజ చేస్తే 20-25 రోజుల్లోనే కళ్యాణం ఘడియలు వచ్చేస్తాయి. మీ కోరిక నెరివేరిన తర్వాత ఎనిమిది ముత్తయిదవులు పిలిచి అందులో పెద్ద ఆవిడ్ని రుక్మిణిగా భావించి తాంబూలం ఇచ్చిన తర్వాత రవికల గుడ్డ, వీలైతే చీర ఇచ్చి వాళ్ల కాళ్లకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి.
అలా చేసినప్పుడు పారాయణం పూర్తయినట్టే.


రుక్మిణి కళ్యాణ లేఖ చదవితే మంచి జీవిత భాగస్వామి దొరుకుతుందని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది . మీరు ప్రేమించిన వారయినా, ఇష్టపడిన వారయినా మీకు మంచి భాగస్వామి అవుతారనుకుంటే ఆ దేవుడు మీ కోరికను కచ్చితంగా నెరవేరుస్తాడు . మీకు వారు సరిపోరని భావిస్తే ఆ సంబంధాన్ని తప్పించి మీకు కలిసి వచ్చి వారినే ఆ దేవుడు జతగా తోడుగా ఇస్తాడని విశ్వాసం ఉంది.

Related News

God Idols: ఇంట్లో ఉంచకూడని దేవుని ఫోటోలు ఏవో తెలుసా..? ఆ తప్పు మీరు అసలు చేయకండి

Tirumala VIP Free Darshan:  ఉచితంగా తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కావాలా? అయితే ఇలా చేయండి

Vastu Tips: మీ పూజ గది ఇలా ఉందా ? అయితే సమస్యలు తప్పవు !

Ekadashi August 2025: ఆగస్టులో ఏకాదశి ఎప్పుడు? పుత్రదా, అజా ఏకాదశుల పూర్తి వివరాలు..

Sravana Masam 2025: శ్రావణ మాసంలో చివరి సోమవారం ఈ పూజ చేస్తే.. సకల సంపదలు

Karungali Mala: ఒక చిన్న మాల.. జీవితాన్ని మార్చేస్తుందా? ఇది దేవుని ఆశీర్వాదమా!

Big Stories

×