Clock Vastu Tips: గడియారాన్ని సరైన దిశలో ఉంచితే.. అది మీకు అదృష్టం, డబ్బు, సంతోషాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. కానీ తప్పుడు దిశలో ఉంచిన గడియారం అడ్డంకులు, ప్రతికూలతను తెస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు మన జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈ ముఖ్యమైన వస్తువులలో ఒకటి గడియారం. ఇది సమయాన్ని చూపించే సాధనం మాత్రమే కాదు.. జీవితంలో కొనసాగుతున్న సమయం, శక్తి, అవకాశాలను సూచిస్తుంది. గడియారాన్ని సరైన దిశలో ఉంచితే.. అది అదృష్టం, పురోగతి, శ్రేయస్సును తీసుకురావడంలో సహాయపడుతుంది. కానీ గడియారాన్ని తప్పుడు దిశలో ఉంచితే అది సమస్యలను తెచ్చిపెడుతుంది.
1. గడియారాన్ని ఏ దిశలో ఉంచడం శుభప్రదం ?
ఉత్తర దిశ: వాస్తులో.. ఉత్తర దిశను సంపద, శ్రేయస్సుకు అధిపతి అయిన కుబేరుని దిశగా పరిగణిస్తారు. ఇంట్లో లేదా ఆఫీసుల్లో గడియారాన్ని ఉత్తర దిశలో ఉంచితే.. అది ఆర్థిక పురోగతిని, సానుకూల శక్తిని పెంచుతుంది.
ప్రకటన
తూర్పు దిశ: ఈ దిశను సూర్యుడి దిశగా పరిగణిస్తారు. అంతే కాకుండా ఇది జ్ఞానం, విజయం, శక్తికి మూలంగా చెబుతారు. తూర్పు దిశలో గడియారం ఉంచడం వల్ల కుటుంబ సభ్యులలో విశ్వాసం పెరుగుతుంది. అంతే కాకుండా పిల్లలకు చదువులపై ఆసక్తి పెరుగుతుంది. ఫలితంగా విజయం వరిస్తుంది. ఈ దిశ విద్యార్థులకు, ఉద్యోగస్తులకు చాలా మేలు చేస్తుంది.
పశ్చిమ దిశ: వాస్తు ప్రకారం.. ఈ దిశ కూడా గడియారం పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా కారణం చేత గడియారాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచలేకపోతే.. అప్పుడు పశ్చిమ దిశను ప్రత్యామ్నాయంగా ఎంచుకోండి. ఈ దిశ ఇంట్లో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
2. గడియారాన్ని ఏ దిశలో ఉంచడం అశుభం ?
దక్షిణ దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం.. దక్షిణ దిశను యముని దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల జీవితంలో అడ్డంకులు, మానసిక ఒత్తిడి, నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం, ఆరోగ్య సమస్యలు , ప్రతికూల శక్తి పెరుగుతాయి. కాబట్టి ఈ దిశలో గడియారం పెట్టకూడదు.
3. గడియారం పెట్టడానికి నియమాలు, జాగ్రత్తలు:
ఇంట్లో ఆగిపోయిన.. లేదా నెమ్మదిగా నడుస్తున్న గడియారాన్ని అస్సలు ఉంచకూడదు. ఇది జీవితంలో స్తబ్దత, నిరాశ , అవకాశాలు రాకుండా చేస్తుంది. అంతే కాకుండా గడియారంలోని బ్యాటరీలను సమయానికి మారుస్తూ ఉండండి. అంతే కాకుండా దానిని సరైన సమయానికి సెట్ చేయండి.
మరిన్ని జాగ్రత్తలు:
మీ గడియారాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. గడియారం మీద దుమ్ము ఉంటే లేదా దాని గాజు పగిలి ఉంటే అది అశుభంగా పరిగణించబడుతుంది. ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అందుకే గడియారాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.
బెడ్‌రూమ్‌లో గడియారం ఉంచేటప్పుడు జాగ్రత్తలు : మీరు మీ బెడ్‌రూమ్‌లో గడియారం ఉంచాలనుకుంటే.. దానిని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉన్న గోడపై ఉంచండి. గడియారాన్ని తల వెనుక గోడపై లేదా నేరుగా మంచం ముందు ఉంచకూడదు.
Also Read:
గడియారం ఆకారం, రంగు:
గుండ్రని, అష్టభుజాకార గడియారాలను వాస్తు ప్రకారం శుభప్రదంగా భావిస్తారు. దీర్ఘచతురస్రాకార లేదా త్రిభుజాకార గడియారాలను ఇంట్లో పెట్టకూడదు. గడియారం యొక్క రంగులు ఆహ్లాదకరంగా ఉండాలి. తెలుపు, నీలం, ఆకుపచ్చ మొదలైనవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.
గడియారం దగ్గర అద్దం ఉండకూడదు: గడియారం ముందు లేదా దగ్గర అద్దం ఉండకూడదు. ఎందుకంటే.. ఇది పాజిటివ్ ఎనర్జీని దూరంగా ఉంచుతుంది. అంతే కాకుండా మానసిక అస్థిరతను కూడా పెంచుతుంది.