RCB Fan Challenge: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా రాణిస్తోంది. పాయింట్లు పట్టికలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అంటే దాదాపుగా ప్లే ఆఫ్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వెళ్లినట్లే అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
Also Read: Rishabh Pant: బల్లెం వదిలిన రిషబ్ పంత్.. నీరజ్ చోప్రా లాగా గోల్డ్ మెడల్ ఇవ్వాల్సిందే
ఈసారి కప్పు కొట్టకపోతే… నా భార్యకు విడాకులే?
గత 17 సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ జట్టు ఒక్కసారి కూడా.. తప్పు గెలవలేకపోయింది. ఈసారైనా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. కచ్చితంగా ప్లే ఆఫ్ కి వెళ్తుంది. ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన ఓ అభిమాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు గెలవకపోతే తన భార్యకు విడాకులు అంటూ బాంబు పేల్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన భార్య ముందే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు సదరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమాని. దీంతో జట్టుపై మరింత.. అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…. క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒరేయ్ నీ భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయ్ కానీ రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టుకు ఎందుకు లింకు పెడుతున్నావు అని ఫైర్ అవుతున్నారు. ఒకవేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోతే.. నీకు ఆమె విడాకులు ఇస్తుందని మరి కొంతమంది కౌంటర్ పిలుస్తున్నారు. ఇక మరికొంతమంది… వీడు కావాలని ఆ పందెం కట్టాడు… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలాగైనా కప్పు కొట్టదని అతడికి కాన్ఫిడెన్స్ ఉంది. తన భార్యను వదిలించుకోవడానికి ఇలా ఛాలెంజ్ విసిరాడని కామెంట్స్ చేస్తున్నారు.
పాయింట్లు పట్టికలో బెంగళూరు నెంబర్ వన్
ఐపీఎల్ 2025 టోర్నమెంటు నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దాదాపు ప్లే ఆఫ్ కు వెళ్లినట్టే. మరో మ్యాచ్ గెలిస్తే అధికారికంగా వెళుతుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… ఏకంగా 8 మ్యాచ్లలో గెలిచింది. కేవలం మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. దీంతో 16 పాయింట్లు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఇదే ఊపు కొనసాగిస్తే ఖచ్చితంగా కప్పు కొట్టడం గ్యారంటీ.
Also Read: MLA Kaushik meets KL Rahul: రాహుల్ ను కలిసిన కౌశిక్ రెడ్డి..పింక్ కండువా కప్పేసాడు !
?igsh=bXY1bmI2NGI4dmtm