BigTV English
Advertisement

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Hyderabad Murder:  దారి మద్యలో లిఫ్ట్ ఆడిగిన పాపానికి ప్రాణం మీదకి వచ్చిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. యువకులతో చిన్న మాట ఆ వ్యక్తి నిండు ప్రాణం తీసింది. ఎల్బీనగర్‌లో నాచారం వెళ్లేందుకు లిఫ్ట్ అడిగిన 45 ఏళ్ల మురళీకృష్ణకు ముగ్గురు యువకులు కారులో లిఫ్ట్ ఇచ్చారు. కారులో వారికి వాగ్వాదంతో మొదలై, మురళీ కృష్ణ హత్యకు దారితీసింది.


హత్యకు గురైన మురళీకృష్ణ భార్య తులసి బిగ్ టీవీతో మాట్లాడారు. ‘‘సోమవారం సాయంత్రం ఉప్పల్ నుండి జిల్లాలగూడలో ఉన్న మా మరిది ఇంటికి నా భర్త వచ్చాడు. రాత్రి తిరిగి జిల్లెలగూడ నుండి ఉప్పల్ కి బయలుదేరాడు. ఎల్బీనగర్ లో కారు ఎక్కి ఉప్పల్ వైపు వచ్చాడని పోలీసులు చెప్తున్నారు.నాకు అర్ధరాత్రి తర్వాత ఫోన్ చేసి నీ భర్తకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత చనిపోయాడని చెప్పడంతో హాస్పిటల్ కి వెళ్లి చూసేసరికి కత్తిపోట్లకు గురై చనిపోయి ఉన్నాడు. నా భర్తను అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నా.’’ అని మృతుడి భార్య డిమాండ్ చేశారు.

Hyderabad: నాచారంలో దారుణం.. చట్నీ మీద పడేశాడని వ్యక్తి దారుణ హత్య


పోలీసులు కూడా కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి హత్య గల కారణాలను బయటికి తీయాలని కోరారు. తమకు ఎలాంటి శత్రువులు లేరని, చట్నీ కోసం గొడవపడి హత్య చేస్తారా అని ప్రశ్నించారు. ‘‘నా భర్త ఎవరిని లిఫ్టు అడగడు నడుచుకుంటూ వస్తాడు లేదంటే బస్సు వస్తాడు. కారులో తీసుకెళ్లి కొట్టి 9 కత్తిపోట్లు పొడిచి నా భర్తను హత్య చేశారు. నా భర్త చనిపోవడంతో ఇంటి పెద్ద దిక్కున కోల్పోయాము మా పరిస్థితి ఏంటి ఇప్పుడు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.‘నాకు ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు. నా భర్త చంపిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నా.’ అని అన్నారు.

యువకుల దాడిలో కొంత దూరం పరుగెత్తి మృతి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చట్నీ పడటం అనే చిన్న విషయంలో ముగ్గురు యువకులు కలిసి మురళీకృష్ణపై దాడి చేయడంపై హైదరాబాద్ ప్రజలు, నెటిజన్లు అవాక్కయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నాచారం పోలీసులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్టు గుర్తించారు.

 

Related News

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×