Big Stories

Parayanam : పారాయణం ఎందుకు చేయాలి…

Parayanam

- Advertisement -

Parayanam : ఈ మధ్య ఎక్కడ చూసినా హనుమాన్ చాలీసా పారాయణం , గోవింద నామ పారాయణం చేస్తున్నారు. అసలు పారాయణం ఎందుకు చేయాలి… పారాయణం ఎలా చేస్తే ప్రయోజనం కలుగుతుందో ధర్మశాస్త్రాల్లో సవివరంగా చెప్పారు. ఏకాగ్రతతో ఇష్టమైన భగవంతుడి నామాన్ని సర్మించడమే పారాయణం. కలియుగంలో కడతేరడానికి సులువైన మార్గం కూడా ఇదే. జీవితంలో ఉత్తమగతులు పొందడానికి పారాయణం ఒక దివ్యమైన మార్గం

- Advertisement -

హనుమాన్ చాలీసాను ఐదు లేదా 9 లేదా 11 రోజులపాటు పారాయణం చేయాలి. హిందువుల పవిత్ర గ్రందం భగవద్గీతను ప్రతీ రోజు ఒక అధ్యయనాన్ని పారాయణం చేయాలి. అదే భాగవతం విషయానికి వస్తే వారం రోజుల్లోనే పారాయణం చేయాలన్న పద్ధతి ఉంది. లలితా సహస్రనామ పారాయణం ఇంటి ఇల్లాలితోపాటు కుటుంబ సభ్యులతో కలిసి వారానికిసారి నిర్వహించవచ్చు. భాగవతాలు లాంటివి అర్ధం చేసుకుంటూ చదివితే తేలిగ్గా లీనం కావచ్చు. ఆ భాష పూర్తిగా అర్ధంకాకపోయినా తెలుసుకోవాలన్న ఆలోచన పాఠకులకి త్వరగానే విషయం బోధపడుతుంది.

ఉత్తిగా పుస్తకాల్లోని అక్షరాలు చదివితే ప్రయోజనం ఉండదు. అందులోని అంతరార్ధాన్ని పరామార్ధాన్ని అర్ధం చేసుకోవాలి. భగవంతుడ్ని నామ పారాయణం, కథలు చదివేటప్పుడు లీనం కావాలి. అప్పుడే అర్థం పరామర్థం కలుగుతుంది. భగవంతుడిపై దృష్టి పెట్టాలి. చదువు రాని వారు ఇతరులు పారాయణం చేసేటప్పుడు శ్రద్ధగా విన్నా అదే ప్రయోజనం చేకూరుతుంది. విష్ణు సహస్రనామాలు, రామాయణం, ధ్యాస పెట్టి చదవాలి. ఏదైనా పనిమొదలుపెట్టినప్పుడు మధ్యలో లేవకూడదు. అధ్యయాన్ని సగం చదివి వదిలివేయకూడదు. నిత్యం పారాయణం చేయడ వల్ల సమాజంలో ధార్మిక విలువలు పెరుగుతాయి. దేవాలయాల్లో ప్రజ సంక్షేమం కోసం, దేవుడ్ని ప్రార్ధిస్తూ పారాయణాలు నిర్వహిస్తూ ఉంటారు. కరోనా సమయంలో టీటీడీ శ్రీవారిని ప్రార్ధిస్తూ పారాయణం నిర్వహించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News