E-Paper
Advertisement

Shiva Lingam : శివలింగాలు.. వాటి పూజా ఫలితాలు..

Shiva Lingam : శివలింగాలు.. వాటి పూజా ఫలితాలు..
Advertisement

Advertisement

Shiva Lingam : మనం శివాలయాల్లో అనేక రకాల శివలింగాలను చూస్తుంటాము. శివలింగం దేనితో నిర్మితమైందనే దానిని బట్టి దానిని పూజించేవారికి ఫలితం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు.
వజ్రంతో తయారైన శివలింగాన్ని పూజిస్తే ఆయుష్షు పెరుగుతుందనీ,
ముత్యపు లింగాన్ని సేవించటం వల్ల రోగాలు నయమవుతాయని చెబుతారు.
ఇక.. కనకపుష్యరాగంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే అపారమైన పేరు ప్రఖ్యాతులు, మరకత లింగార్చనతో సుఖ ప్రాప్తి కలుగుతాయి.
లోహంతో చేసిన శివలింగార్చన శత్రువులను నిర్మూలిస్తుందనీ, ఇత్తడి లింగాన్ని ఆరాధిస్తే.. గొప్ప తేజస్సు కలుగుతుందట.
ఇక.. గంధపు లింగార్చన స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుందనీ, వెన్న లింగాన్ని పూజిస్తే మోక్షం ప్రాప్తిస్తాయి.
ధాన్యపు పిండితో చేసిన లింగార్చనవల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుంది.
అయితే… వీటన్నింటిలో పాదరస శివ లింగార్చన అన్ని కోరికలు తీర్చుతుందని చెబుతారు. పాదరస లింగం చూసేందుకు చిన్నదిగా వున్నా చాలా బరువుంటుంది.
మన దేశంలో ఒకేఒక పాదరస శివలింగం ఉంది. అది ఉజ్జయినిలో సిధ్ధాశ్రమంలోని శివాలయంలో ఉంది. సుమారు 1500 కేజీల బరువున్న ఈ లింగాన్ని తాకగానే.. మనిషిలోని నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుందని చెబుతారు.
భక్తులు ఈ లింగాన్ని తాకి దర్శనం చేసుకోవచ్చు. లింగానికి కొంతసేపు తల ఆన్చితే తలలో నరాలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయని అక్కడివారి నమ్మకం.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×