Harati:-ఇంట్లోనూ, పూజా గదిలోనే కాదు గుడిలోనూ, శుభ కార్యాలప్పుడు… పిల్లల పుట్టిన రోజున వేడుకల్లోనూ, కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి ప్రవేశించేటప్పుడు హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా దానికి ఓ ఆరోగ్య సూత్రం ఉంది.శుభకార్యాల్లో స్నేహితులు, బంధువులు, గ్రామస్థులంతా ఒకే చోట చేరుతారు. అలాగే దేవాలయంలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దాని వలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. క్రిములు చేరతాయి. హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. అందుకే హారతి ఇచ్చిన తర్వాతే దేవుడికి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
అంటు వ్యాధులు అంటకుండా ఉంటాయి. .హారతి కళ్లకు అద్దుకోవడం వల్ల ముక్కుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.అలాగే అంటు వ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటాయి.కర్పూర హారతి ఎలాగైతే క్షీణించి పోతుందో, అలాగే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు సమసిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందరూ బాగుండాలి అని కోరుకుంటూ హారతిని కళ్లకు అద్దుకోవటమే అసలు సిసలు ఆథ్యాత్మిక అర్థం.పరమార్థమని పండితులు వివరిస్తున్నారు
భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో గానీ పైకి గట్టిగా గానీ స్తోత్రాలు చదవడము చేస్తాము. ఆ సమయంలో మన ప్రార్ధనలో తపన మరియు భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవమవుతుంది. చివరలో ఆ వెలుగు పై మన చేతులనుంచి తరువాత నెమ్మదిగా మన కళ్ళకు తల పైభాగానికి అద్దుకొంటాము.
సాధారణంగా దేవునికి కర్పూరంతో హారతి ఇస్తారు. ఇలా కర్పూరంతో హారతి ఇవ్వడమే మంచిది, శ్రేష్టం. కానీ, కొన్ని సందర్భాల్లో నేతిలో నానబెట్టిన దూది వత్తులతో కూడా హారతి ఇస్తారు.
ద్వాపర యుగం నాటి బిలం ఎక్కడుంది?
for more updates folow this link:-bigtv