Big Stories

Kavitha : టార్గెట్ నేను కాదు.. ఈడీ నోటీసులపై కవిత రియాక్షన్..

Kavitha : ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తాను చేసింది ఏమీ లేదన్నారు. తాను ఫోన్లు ధ్వంసం చేయలేదని స్పష్టం చేశారు. అడిగితే తన ఫోన్లు ఇస్తానని చెప్పారు. దేనికీ భయపడనని తేల్చి చెప్పారు. కేసును ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు. అరెస్ట్‌ చేస్తే ప్రజల దగ్గరికి వెళ్తానన్నారు. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతానన్నారు. ప్రజా వ్యతిరేకత, అణచివేత చర్యలకు తెలంగాణ ఎప్పుడూ తలవంచదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలతో కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను లొంగదీసుకోవడం కుదరదన్నారు కవిత.

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గతంలో సీబీఐ ప్రశ్నించిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అప్పుడు ఆరుగంటలపాటు సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చానని వివరించారు. బీజేపీ టార్గెట్‌ తాను కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ నే బీజేపీ టార్గెట్ చేసిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన పాత్రేమీ లేదని మరోసారి స్పష్టం చేశారు.

- Advertisement -

చట్టాన్ని గౌరవిస్తానని..దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కవిత చెప్పారు. ఈడీ విచారణకు హాజరయ్యే అంశంపై న్యాయ సలహా తీసుకుంటానని తెలిపారు. ఈ నెల10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు . ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావడంపై సమయం కోరతానన్నారు.

గురువారం విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలతో బీజీగా ఉన్నానన్నారు. ఈ నెల 15న ఈడీ విచారణకు హాజరవుతానని తెలిాపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News