BigTV English

Bhadrapada Purnima 2024 Date : భాద్రపద పూర్ణిమను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు ?

Bhadrapada Purnima 2024 Date : భాద్రపద పూర్ణిమను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు ?

Bhadrapada Purnima 2024 Date : హిందువులు ప్రత్యేకంగా పూజించే సమయాల్లో పౌర్ణమి రోజులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతీ పౌర్ణమి రోజులలో ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తారు. వీటిలో కొన్ని పూర్ణిమలకు హిందూ మతంలో ప్రత్యేక హోదా ఇవ్వబడింది. ఈ రోజుల్లో మహా విష్ణువు పూజిస్తే అన్ని పాపలు తొలగిపోతాయని, విష్ణువు కరుణిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే ఈ నెల పితృ పక్షం భాద్రపద మాసం పౌర్ణమి రోజు నుండి ప్రారంభమవుతుంది. అయితే, మొదటి శ్రాద్ధం అశ్వినీ శుక్ల ప్రతిపాదిత రోజున నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా పౌర్ణమి రోజునే చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో, చంద్ర గ్రహణంతో పితృ పక్షం ప్రారంభం అశుభమైనదిగా పరిగణించబడుతుంది.


భాద్రపద పూర్ణిమ ఎప్పుడు?

పంచాంగం ప్రకారం, భాద్రపద మాసం పౌర్ణమి సెప్టెంబర్ 17వ తేదీన మంగళవారం ఉదయం 11:44 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 18 వ తేదీ, బుధవారం ఉదయం 8:04 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ఆధారంగా, సెప్టెంబర్ 18 వ తేదీన భాద్రపద పూర్ణిమ రానుంది.


పూర్ణిమ వ్రతం, స్నానం, దాన ధర్మాల విషయానికొస్తే, సత్యనారయణ కథ, లక్ష్మీపూజ, చంద్రారాధన చేసేవారు సెప్టెంబర్ 17 వ తేదీన భాద్రపద పూర్ణిమ వ్రతం పాటించడం సముచితం. సెప్టెంబరు 18 వ తేదీన ఉదయ తిథి నాడు పౌర్ణమి స్నానం చేసి దానం చేస్తే మంచిది. పూర్ణిమ వ్రతం ఆచరించడం, పూజలు చేయడం, స్నానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి.

భాద్రపద పూర్ణిమ ప్రత్యేకత

పితృ పక్షం భాద్రపద పూర్ణిమకు నాందిగా పరిగణించబడుతుంది. కాబట్టి, ఈ రోజున శ్రీ హరి విష్ణువుతో పాటు పూర్వీకులకు పూజలు మరియు క్రతువులు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తారు. అంతే కాకుండా, సంపద దేవత లక్ష్మీ దేవిని కూడా పౌర్ణమి రోజున పూజిస్తారు. ఈ పౌర్ణమి నాడు చంద్రోదయ సమయం సెప్టెంబర్ 17 వ తేదీన సాయంత్రం 6:03 గంటలకు ప్రారంభమవుతుంది. కావున పూర్ణిమ వ్రతం పాటించేవారు సాయంత్రం 6.03 గంటల తర్వాత చంద్రుడిని పూజించాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Vastu For Staircase: ఇంటి లోపల.. మెట్లు ఏ దిశలో ఉండాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..

Big Stories

×