BigTV English

Nellore Bus Accident: నెల్లూరులో బ‌స్సు బోల్తా.. స్పాట్‌లోనే 46 మంది

Nellore Bus Accident: నెల్లూరులో బ‌స్సు బోల్తా.. స్పాట్‌లోనే 46 మంది

Nellore Bus Accident: నెల్లూరు జిల్లా కోవూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఓ ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయణికులతో పాటు.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. బస్సు భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 46 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.


సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున.. ఐదు గంటల సమయంలో కోవూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు.. అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తం అయిన తోటి ప్రయాణికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.


Also Read: ఘోర ప్రమాదం.. గరుడవారిధి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి.. ఇద్దరు మృతి

క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రైవర్ నిద్రమత్తు కారణమా? లేక అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందా ? అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.

ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారి పై కొంతసేపు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి..  బస్సును రోడ్డు పక్కకు తరలించారు. తర్వాత ట్రాఫిక్‌ సాధారణ స్థితికి వచ్చింది.

Related News

Andhra Pradesh: ఇదేక్కడి దారుణం.. తనను చూసి నవ్వాడని నరికి చంపేశాడు..

MP Crime: ఛీ.. కామాంధుడా, మహిళ శవాన్ని కూడా వదల్లేదుగా.. సీసీ కెమేరాకు చిక్కిన దారుణం

Tirupati Accident: ఘోర ప్రమాదం.. గరుడవారిధి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి.. ఇద్దరు మృతి

Sibling Abuse: ఏపీలో దారుణం.. చెల్లిపై లైంగిక దాడి చేసిన అన్న.. మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక

Delhi Crime News: జోద్‌పూర్‌లో ప్రేమ.. ఢిల్లీలో ముగింపు, వెనుక జరిగింది అదే?

Bapatla Crime: పెళ్లయిన 10 రోజులకే వరుడు హత్య, ఆరా తీస్తే, షాకింగ్ విషయాలు

Bus Incident: ఎదురెదురుగా ఢీ కొన్న బస్సులు.. స్పాట్‌లో 10 మంది

Big Stories

×