America: అగ్రరాజ్యం అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిలిటరీ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోని ఇల్లులు ధ్వంసమయ్యాయి.. కార్లు ఎగిరిపడ్డాయి. ప్రమాద స్థలంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.