Yashasvi Jaiswal Run Out: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య రెండు టెస్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డబుల్ సెంచరీ చేయాల్సిన యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal) 175 పరుగులకే రనౌట్ అయ్యాడు. రెండో రోజు మ్యాచ్ ప్రారంభం కాగానే ఈ రనౌట్ జరిగింది. యశస్వి జైస్వాల్ అనవసరంగా పరుగుకు వెళ్లడంతో, రనౌట్ అయ్యాడు. దీంతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. అయితే, ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ రనౌట్ అయిన విధానం వివాదంగా మారింది. వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ వికెట్లను గిరాటేయడం కాస్త తేడాగా ఉంది. బంతి చేతిలో లేక ముందే వికెట్లను కొట్టేసాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు అది నాటౌట్ అని కొంతమంది అంటున్నారు. దీంతో యశస్వి జైస్వాల్ రనౌట్ పై దుమారం రేగుతోంది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య కాసేపటి క్రితమే రెండో రోజు ఆట ప్రారంభమైంది. అయితే 175 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ దురదృష్టవశాత్తు అవుటయ్యాడు. దీంతో డబుల్ సెంచరీ చేసుకోక ముందే ఈ 23 ఏళ్ల క్రికెటర్ పెవిలీయన్ కు వెళ్ళిపోయాడు. అతడు ఔట్ కాగానే, క్రికెట్ అభిమానులు అందరూ డిస్సప్పాయింట్ అయ్యారు. అనవసరంగా పరుగుకు వెళ్లాడని కొంతమంది అంటున్నారు. అయితే మరికొంతమంది టీమిండియా కెప్టెన్ గిల్ తప్పిదం ఉందని ఫైర్ అవుతున్నారు.
యశస్వి జైస్వాల్ రనౌట్ కావడంపై పెద్ద దుమారం రేగుతోంది. డబుల్ సెంచరీ చేస్తాడనుకుంటే అనవసరంగా రనౌట్ అయ్యాడు. అయితే ఈ రనౌట్ లో టీమిండియా కెప్టెన్ గిల్ తప్పు కూడా ఉందని అంటున్నారు. కావాలనే క్రీజు వదలకుండా అందులోనే గిల్ ఉండటం వల్ల యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యాడని ఫైర్ అవుతున్నారు అభిమానులు. సెల్ఫిష్ గా గిల్ వ్యవహరించడంతో కుర్రాడు యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడని మండిపడుతున్నారు. సగం కంటే ఎక్కువ పిచ్ దాటి, యశస్వి జైస్వాల్ వచ్చాడు. కానీ గిల్ మాత్రం తాను ఔట్ అవుతాననే భయంతో క్రీజు లోపలే ఉన్నాడు. అంటే డబుల్ సెంచరీ చేయబోతున్న యశస్వి జైస్వాల్ ను ఔట్ చేసేందుకే ఇలా కుట్రలు పన్నాడని గిల్ పై మండిపడుతున్నారు.
ఇలాంటి సమయంలో మహేంద్ర సింగ్ ధోని లాంటి వాళ్లు ఉంటే పరిస్థితి వేరే లాగా ఉంటుందని అంటున్నారు. డబుల్ సెంచరీ చేసే ప్లేయర్ మరో ఎండ్ కు ఉంటే, ధోని లాంటి ప్లేయర్ రన్ కోసం పరిగెత్తే వాడని, అవసరమనుకుంటే తన వికెట్ ఇచ్చేవాడని అంటున్నారు. కానీ గిల్ మాత్రం సెల్ఫిష్ గా వ్యవహరించినట్లు మండిపడుతున్నారు. ఇలాంటి కెప్టెన్ ను తొలగించాల్సిందేనని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. ఇక అటు జైస్వాల్ రన్ తీస్తుండగా, బంతిని అందకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ పెద్ద తప్పిదమే చేశాడట. బంతి చేతిలో లేకముందే, వికెట్లను గిరాటేశాడు. అలా చేస్తే నాటౌట్. కానీ అంపైర్ ఔట్ అని ప్రకటించారు. రిప్లై లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో జైస్వాల్ వెనుదిరిగాడు.
Yashasvi Jaiswal started running like a blind man without seeing the fielder and got run out, After being run out, he was trying to put all the blame on Shubman Gill.
Never seen a More Shamless Player Than panipuri pic.twitter.com/XXGAldoBIA
— Honest Cricket Lover (@Honest_Cric_fan) October 11, 2025
Meet Shubman Gill,
Recently Replaced Rohit Sharma as ODI captain by failing in knockouts and doing yes sir yes sir to Gautam Gambhir.
Today his insecurities reached a level where he stolen a deserving 200 from Yashasvi Jaiswal by making him runout. pic.twitter.com/sU3dTZ3teX
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) October 11, 2025
Without even a third umpire’s consideration, it’s given out! 🤔👀
What are your thoughts on Yashasvi Jaiswal’s dismissal — was it out or not out? 👇#YashasviJaiswal #INDvWI #Delhi #Sportskeeda pic.twitter.com/m8UQcpjUL4
— Sportskeeda (@Sportskeeda) October 11, 2025