Peddi Movie: రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్(Ram Charan). ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి, అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమా తర్వాత గౌరవ డాక్టరేట్, టుస్సాడ్ మ్యూజియంలో స్థానం.. ఇంకా చెప్పాలంటే ఎన్నో అరుదైన గౌరవాలను దక్కించుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత అంతే క్రేజ్ తో ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్(Game changer) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో ప్రస్తుతం అభిమానుల చూపంతా పెద్ది (Peddi ) సినిమా పైనే అని చెప్పాలి. ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న ఈ సినిమా విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi kapoor)హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
వాస్తవానికి ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక భారీ బడ్జెట్ స్టార్ హీరోల చిత్రాల విషయాల్లో ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్ పెడుతున్న నేపథ్యంలో స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపుతూ స్పెషల్ సాంగ్ లతో సినిమాలకు మరింత క్రేజ్ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తో మాస్ స్టెప్స్ వేయించడానికి బుచ్చిబాబు ఒక స్పెషల్ సాంగ్ రూపొందిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆ యువరాణిని మాత్రమే స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు వెలువడుతున్నాయి.
ALSO READ:Narne Nithin: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నార్నే నితిన్.. ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ లుక్!
విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తో స్పెషల్ సాంగ్ చేయించాలని అభిమానులు పెద్ద ఎత్తున కోరుతున్నారు. కాజల్ అగర్వాల్ – రామ్ చరణ్ కాంబినేషన్లో తొలిసారి వచ్చిన చిత్రం ‘మగధీర’. ఇందులో యువరాణి పాత్రలో కాజల్ చాలా అద్భుతంగా నటించింది. వీరిద్దరికీ ఈ సినిమా పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ను అందించింది కూడా.. ఆ తర్వాత వీరిద్దరూ నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే వంటి చిత్రాలలో నటించారు. ఇప్పుడు ఈమె అయితే రామ్ చరణ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని, ఈమెనే స్పెషల్ సాంగ్ లో తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి అభిమానుల డిమాండ్ మేరకు బుచ్చిబాబు, రామ్ చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అటు కాజల్ అగర్వాల్ కూడా ఈ మధ్య స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది . ఒకవేళ కాంబో సెట్ అయిందంటే మాత్రం థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.