E-Paper
Advertisement

Draupadi: ఐదుగురు భర్తలతో కాపురం చేసిన ద్రౌపదిని పతివ్రత అంటారెందుకు – అసలు నిజం ఏంటో తెలుసా..?

Draupadi: ఐదుగురు భర్తలతో కాపురం చేసిన ద్రౌపదిని పతివ్రత అంటారెందుకు – అసలు నిజం ఏంటో తెలుసా..?
Advertisement

Draupadi: ఐదుగురు భర్తలతో కాపురం  చేసిన ద్రౌపదిని పతివ్రత అని ఎందుకు అంటారు..? అదే ద్రౌపదిని పంచమహా కన్యలలో ఒకరిగా ఎందుకు పూజిస్తారు..? అసలు ద్రౌపది గురించి భారతంలో ఏముంది..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రౌపదికి ఉన్న పూర్వజన్మ వరం: ద్రౌపది పూర్వజన్మలో ఒక సాధ్వి. తనకు సర్వలక్షణాలు ఉన్న భర్త కావాలని శివుని గురించి తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆమె పతిం దేహి (భర్తను ప్రసాదించు) అంటూ ఐదుసార్లు అడిగిందట. శివుడు తథాస్తు అని వచ్చే జన్మలో నీకు ఐదుగురు భర్తలు లభిస్తారని వరమిచ్చాడట. ఆ వరమే ద్రౌపదికి పాండవుల రూపంలో సాకారమైందట.

Advertisement

మాతృవాక్యం – ధర్మపాలన: అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకుని ఇంటికి తీసుకువచ్చినప్పుడు కుంతీదేవి లోపల ఉండి… వారు తెచ్చింది ఏమిటో చూడకుండానే  మీరు తెచ్చిన దానిని ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పిందట. ఆ కాలంలో మాతృవాక్యం అనేది వేదవాక్కుతో సమానమట. తల్లి మాటను జవదాటకూడదనే ధర్మం కోసం పాండవులు, ద్రౌపది ఈ కఠిన నిర్ణయానికి కట్టుబడ్డారట.

మానసిక పవిత్రత మరియు నియమ నిష్టలు: ద్రౌపది పాండవులతో కాపురం చేసేటప్పుడు ఒక కఠినమైన నియమాన్ని పాటించేదట. ఆమె ప్రతి సంవత్సరం ఒకరి వద్ద మాత్రమే ఉండేదట. ఒకరి కాలం ముగిసి మరొకరి వద్దకు వెళ్లే ముందు ఆమె అగ్నిలో ప్రవేశించి తన కన్యాత్వాన్ని, పవిత్రతను తిరిగి పొందేదని (వరం వల్ల) పురాణాలు చెబుతున్నాయి. ఆమె ఏ సమయంలో ఎవరికి భార్యగా ఉంటుందో, ఆ సమయంలో వారి పట్ల మాత్రమే సంపూర్ణ విధేయతతో, భక్తితో ఉండేదట. మనసులో కూడా ఇతర పురుషుల గురించి ఆలోచించేది కాదట.

Advertisement

అచంచలమైన కృష్ణ భక్తి: ద్రౌపది తన జీవితంలో ఎదురైన అవమానాలను (వస్త్రాపహరణం వంటివి) తట్టుకుని నిలబడగలిగిందంటే దానికి కారణం ఆమె భక్తి. శ్రీకృష్ణుడిని ఆమె తన సోదరుడిగా, దైవంగా భావించిందట. ఆమె ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు ధర్మ రక్షణ కోసం ఆమె చేసిన త్యాగం ఆమెను ఉన్నత స్థానంలో నిలబెట్టాయట.

పంచమహాకన్యలలో ఒకరు: హిందూ ధర్మంలో ఒక శ్లోకం ఉంది.

అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా |

పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతకనాశనమ్ ||

ఈ శ్లోకంలో ద్రౌపది పేరు ఉంది. ఇక్కడ  కన్య అంటే కేవలం శారీరకమైనది మాత్రమే కాదు.. మనస్సుతో పవిత్రంగా ఉండటం. లోక కల్యాణం కోసం ధర్మ స్థాపన కోసం తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ఐదుగురు భర్తలను స్వీకరించిన త్యాగమూర్తి ద్రౌపది అంటూ పురాణాలు చెప్తున్నాయట. ఇంకా చెప్పాలంటే.. ద్రౌపదిని పతివ్రత అనడానికి కారణం ఆమెకు ఐదుగురు భర్తలు ఉండటం కాదు, ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ఆమె తన ధర్మాన్ని, పాతివ్రత్యాన్ని  మనో నిబ్బరాన్ని ఎక్కడా కోల్పోకపోవడమేనట. ఆమె స్త్రీ శక్తికి సహనానికి నిదర్శనమట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పొరపాటున కూడా ఆలాంటి వ్యక్తులను ఇంటికి ఆహ్వానించకూడదట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×