BigTV English

Lockets : సమస్యల నుంచి లాకెట్ బయటపడేస్తుందా…

Lockets  : సమస్యల నుంచి లాకెట్ బయటపడేస్తుందా…
Lockets


Lockets : నిత్య జీవితంలో సమస్యలు రావడం సహజం. కొన్నింటిని ఎంత ఎదుర్కొన్నా తీరవు. అలాంటి వాటికి కొన్ని పరిహారాలు పాటిస్తే పరిష్కార మార్గం దొరుకుందని వాస్తు పండితులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన ఉంగరాలు , లాకెట్ లాంటివి దారి చూపిస్తాయి. హార్ట్ సింబల్ , ఫిష్ లాకెట్ ధరిస్తే సమస్య సుడిగుండాల నుంచి బయటపడతారని అంటారు. కారణం చేప సింబల్ లాకెట్ విషయానికి వస్తే శ్రీ మహా విష్ణువు అవతారాల్లో మత్య్సావతారం ఒకటి. వేదాలు దొంగిలించి రాక్షసుడ్ని సంహరించేందుకు ఎత్తిన అవతారం మత్య్సావతారం. చేప బొమ్మ విష్ణువుకి ప్రతీక. చేప బొమ్మ ఇంట్లో ఉన్నా, లాకెట్ రూపంలో ఉంచుకున్నా మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది.

ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అయ్యేవారు, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు పడేవారికి ఇది పరిష్కార మార్గంగా చూపుతుంది.
చేప బొమ్మను లాకెట్ ధరిస్తే జీవితంలో రాకెట్ లాగా అభివృద్ధి పథంలో దూసుకుపోతారు. వెండి లేదా పంచలోహాలతోనే ఫిష్ లాకెట్ తయారు చేయించుకుని ధరిస్తే ఫలితాలు కలుగుతాయి. ధరించే విష్ణు ఆలయంలో పూజించి జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం రోజున మెడలో వేసుకోవాలి.


హృదయం లేదా లవ్ సింబల్ ఆకారంలో లాకెట్ ధరిస్తే సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీ మాటలకి ఆకర్షించే వారి సంఖ్య పెరుగుతుంది. బంగారం లేదా వెండితో ఈ లాకెట్ తయారు చేయించి జన్మనక్షత్రం రోజున ధఱించాలి. లాకెట్ ధరించే అలవాటు లేని వాళ్లు హార్ట్ సింబల్ ఉంగరాన్ని ధరించినా ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఉంగరాన్ని చేతికి పెట్టుకోవాలి. పూజలో కుంకమ, అక్షింతలతో పూజ తర్వాత తేనెతో ఉంగారానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది. హార్ట్ సింబల్ రింగ్ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్లకి సక్సెస్ ఇస్తుంది. . ఉంగరానికి పోసిన తెనెను చీమలకి పెట్టాలి. ఎన్ని చీమలు ఆ తెనేను స్వీకరిస్తాయో అంతగా ఆ సింబల్ మీకు ఫలితాలను కలిగిస్తుంది.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×