E-Paper
Advertisement

Rahu Ketu Gochar 2024: 2025 సంవత్సరం వరకు వీరికి తిరుగు లేదు.. ఈ రాశుల వారిపై రాహువు, కేతువుల ఆశీస్సులు

Rahu Ketu Gochar 2024: 2025 సంవత్సరం వరకు వీరికి తిరుగు లేదు.. ఈ రాశుల వారిపై రాహువు, కేతువుల ఆశీస్సులు
Advertisement

Rahu Ketu Gochar 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మార్చుతూ ఉంటాయి. దీని ప్రభావం అన్ని రాశుల వారిపైనా పడుతుంది. అయితే జ్యోతిష శాస్త్రంలో రెండు అంతుచిక్కని గ్రహాలైన రాహు, కేతువులు ఉన్నాయి. ఈ రెండు గ్రహాలు అన్ని వేళలా తిరోగమనం వైపు కదులుతు ఉంటాయి. ప్రస్తుతం రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు 18 మే 2025 వరకు అంటే వచ్చే ఏడాది మే నెల వరకు ఈ రాశులలోనే ఉంటాయి. ఈ తరుణంలో రాహువు, కేతువులు పలు రాశులపై ప్రభావం చూపుతాయి. మరి ఆ రాశుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మిథున రాశి

Advertisement

మిథున రాశి వారికి 2025 వరకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో తలెత్తిన విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆఫీసుల్లో కూడా మంచి ఫలితాలు, విజయాలు సాధిస్తుంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా విజయం సాధిస్తారు. ఆర్థిక రంగంలో కూడా పురోగతి సంకేతాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకుంటే మంచిది.

2. కన్యా రాశి

Advertisement

కేతువు కన్యారాశిలో లగ్న స్థానములో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో, కన్యా రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక, వ్యాపార రంగాలలో ప్రయోజనాలను పొందవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. వ్యాపార రంగంలో కూడా ఆర్థిక వృద్ధి ఉండవచ్చు. కన్యా రాశి వారి జాతకంలో రాహువు బలహీన స్థానంలో ఉంటే శివుడిని పూజించడం మంచిది.

3. ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి 2025 సంవత్సరం వరకు కేతు గ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుంది. ఆర్థికంగా, పని రంగాలలో విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. కుటుంబ జీవితంలో కూడా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. కేతువు ఆశీర్వాదంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు కూడా విజయం సాధిస్తారు. ఈ కాలంలో పని, వ్యాపార రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

4. మీన రాశి

రాహువు మీన రాశి వారికి ఆనందం, శ్రేయస్సును ఇవ్వనున్నాడు. శని సాడే సతి వల్ల జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కునే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పురోగతి, కార్యాలయంలో పురోగతి సంకేతాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు శివుడు, హనుమాన్‌, విష్ణువును పూజించండం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×