Maharani Yoga: ద్వాదశ రాశుల్లో మహారాణి యోగం ఉన్న స్త్రీలు ఎవరో తెలుసా..? ఆ రాశుల్లో పుట్టిన మహిళలు ఎలాంటి రాజభోగాలు అనుభవిస్తారో తెలుసా..? ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా..? చలించకుండా ధైర్యంగా నిలబడి పరిస్థితులను ఎదుర్కోనే స్త్రీలు ఏ రాశిలో జన్మిస్తారో తెలుసా..? అసలు ఏ రాశిలో పుట్టిన స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషులు అదృష్టవంతులో ఈ కథనంలో తెలుసుకుందాం.
మనిషి జీవితంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి విషయంలో జ్యోతిష్య శాస్త్రాన్ని ఫాలో అవుతుంటారు. ఇక మనుషుల భూత, భవిష్యత్, వర్తమానాలను జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రాన్ని వివిధ రూపాలుగా వర్గీకరించారు. అందులో పన్నెండు రాశులు, పదిహేను తిథులు, ఇరవై ఏడు నక్షత్రాలు, ఒక్కో నక్షత్రంలో నాలుగు పాదాలు, మొత్తం కలిపి 108 పాదాలుగా వర్గీకరించారు. ప్రతి మనిషి పుట్టిన తిథి, వార, నక్షత్రాన్ని బట్టి అతని జన్మకుండలి రెడీ చేస్తారు. వీటన్నింటి ఆధారంగానే ఆ మనిషి జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే విషయాలు సూక్ష్మంగా తెలియజేస్తారు జ్యోతిష్య పండితులు.
శుభాశుభ గ్రహాలు తామున్న రాశుల స్థితిని బట్టి గ్రహముల కలయికను బట్టి వాటి దృష్టిని బట్టి ఏర్పడతాయి. దాని వల్ల వాటి బలములను అనుసరించి మనిషి యొక్క యోగం నిర్ణయిస్తారు. మనిషి జాతకంలో లగ్నం నుంచి 9వ ఇంట శుభ గ్రహము ఉన్నా.. లేదా తొమ్మిదో ఇటిని శుభ గ్రహం చూసినా ఆ వ్యక్తికి భాగ్య యోగం కలుగుతుంది. ఈ యోగములో జన్మించిన వ్యక్తి శాశ్వత ఐశ్వర్యవంతుడు, రాజ పూజితుడు అవుతాడు. అలాగే రాశులను బట్టి అందులో పుట్టిన మహిళలకు ఎప్పటికైనా మహారాణి యోగం పడుతుందని జ్యోతిష్య శాష్ట్ర నిపుణులు చెప్తున్నారు. అలా పుట్టుకతోనే మహారాణి యోగం కలిగిన స్త్రీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
తులారాశి: తులారాశిలో పుట్టిన మహిళలకు ఎప్పటికైనా మహారాణి యోగం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అలాగే ఈ రాశిలో పుట్టిన మహిళలను పెళ్లి చేసుకున్న పురుషులు కూడా ఎంతో అదృష్ట వంతులు అవుతారని చెప్తున్నారు.
మేషరాశి: మేష రాశిలో పుట్టిన స్త్రీలకు కూడా ఎప్పటికైనా గొప్ప అదృష్టయోగం పడుతుందని పండితులు చెప్తున్నారు. ఈ రాశి స్త్రీలు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. ఎవరీ ముందు తల దించుకునే పరిస్థితి తెచ్చుకోరు. ఎంతటి పనులైనా సాధింస్తారు. ఈ రాశి స్త్రీలకు కాస్త కోపం ఎక్కువ. కొంచెం గడుసుగా కూడా ఉంటారని పండితులు చెప్తున్నారు.
సింహరాశి: మహారాణి యోగం పట్టే స్త్రీలలో సింహా రాశిలో పుట్టిన స్త్రీలు కూడా ఉంటారని పండితులు చెప్తున్నారు. ఈ రాశి స్త్రీలు ఇతరులను వెంటనే ఆకర్షించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువ. వీరు వ్యక్తిత్వం ఇతరులకు స్పూర్తిగా నిలిచేలా ఉంటారని పండితులు చెప్తున్నారు.
మకరరాశి: మకర రాశి జాతక స్త్రీలు కూడా మహారాణి యోగం పట్టే జాబితాలో ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ రాశి స్త్రీలు ధృడ సంకల్పం కలిగి ఉంటారు. ఎటువంటి విపత్కర సమయంలోనూ చలించరు. వీరు బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ పనిలో నిమగ్నమై ఉంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ఇతరులను ఆకట్టుకోవడంలో నేర్పరులు. వీరు ఎప్పుడూ కూడా తమ కుటుంబంతో కలిసి ఉండటానికే ప్రయత్నిస్తారు. వీరికి గర్వం అనేదే ఉండదు. ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడతారు. వీరికి పుట్టినప్పుటి నుంచే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
ఈ ఐదు రాశులలో పుట్టిన స్త్రీలకు మాత్రమే మహారాణి యోగం ఉంటుంది. అనుకోకూడదని. వ్యక్తిగత జాతకం కూడా కొంత మంది స్త్రీలకు మహారాణి యోగం తీసుకొస్తుందని పండితులు చెప్తున్నారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్