E-Paper
Advertisement

7 Horse Painting: ఏడు గుర్రాల పెయింటింగ్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా ? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

7 Horse Painting: ఏడు గుర్రాల పెయింటింగ్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా ? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Advertisement

7 Horse Painting: వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ‘ఏడు గుర్రాల ఫోటో’ ఇంట్లో ఉండటం వల్ల సానుకూలత పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే.. దీనిని తప్పుడు ప్రదేశంలో ఉంచితే అది శక్తిని అస్తవ్యస్తం చేసి సమస్యలకు దారితీస్తుంది.

వాస్తు శాస్త్రంలో ఏడు గుర్రాల పెయింటింగ్‌కు విశిష్టమైన స్థానం ఉంది. ఇవి విజయం, బలం, పురోగతి, వేగానికి చిహ్నాలుగా భావిస్తారు. అయితే.. ఈ ఫోటో కేవలం అలంకరణ కోసం ఎక్కడపడితే.. అక్కడ తగిలించడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా.. ఇంటి వాతావరణంలో అశాంతి కలిగే అవకాశం ఉంది. సరైన దిశ, గది, గుర్రాల స్థితిని బట్టి ఈ పెయింటింగ్ మీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకువస్తుంది. దీనిని ఎలా ఉంచాలో ? ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఏడు గుర్రాల పెయింటింగ్:

హిందూ సంప్రదాయంలో.. సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అందుకే ఈ ఏడు గుర్రాల పెయింటింగ్ అదృష్టానికి చిహ్నంగా మారింది. కానీ వాస్తు ప్రకారం.. కొన్ని నియమాలు పాటించకపోతే మీ ఇంట్లోని ప్రశాంతత దెబ్బతినవచ్చు.

Advertisement

1. సరైన దిశ :
పెయింటింగ్ ఉంచే దిశ అనేది అత్యంత ముఖ్యం. తప్పుడు దిశలో ఉంటే అది ప్రతికూల శక్తిని పెంచుతుంది.

దక్షిణ దిశ: మీరు కెరీర్‌లో కీర్తి, గౌరవం,విజయం ఆశిస్తుంటే.. ఈ పెయింటింగ్‌ను దక్షిణ దిశ గోడపై ఉంచాలి. ఇది మీ పనితీరును మెరుగు పరుస్తుంది.

ఉత్తర దిశ: వ్యాపారంలో లాభాలు , ఆర్థిక పురోగతి కోసం ఉత్తర దిశలో తగిలించవచ్చు.

తూర్పు దిశ: సామాజిక సంబంధాలు, పేరు ప్రఖ్యాతుల కోసం తూర్పు దిశ అనుకూలం.

2. ఏ గదిలో ఉంచాలి ?
లివింగ్ రూమ్ : ఏడు గుర్రాల పెయింటింగ్‌ను ఉంచడానికి హాల్ లేదా లివింగ్ రూమ్ అత్యంత శ్రేయస్కరం. ఇది ఇంటికి వచ్చే సానుకూల శక్తిని పెంచుతుంది.

ఆఫీస్ లేదా పని ప్రదేశం: ఆఫీసులో మీ కుర్చీ వెనక ఉన్న గోడపై దీనిని ఉంచడం వల్ల నిర్ణయాధికారం, వేగం పెరుగుతాయి.

3. ఎక్కడ ఉంచకూడదు ?
తప్పుడు ప్రదేశాల్లో ఉంచితే అది ఎనర్జీని పెంచుతుంది.

బెడ్‌రూమ్: గుర్రాలు వేగానికి, చైతన్యానికి చిహ్నం. బెడ్ రూం ప్రశాంతతకు చిహ్నం. బెడ్‌రూమ్‌లో దీనిని ఉంచడం వల్ల నిద్రలేమి, ఒత్తిడి , కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.

పూజా గది : ఇది ఒక ఫోటో మాత్రమే, కాబట్టి పూజా గదిలో ఉంచడం వాస్తు ప్రకారం సరికాదు.

వంటగది , బాత్రూమ్: ఈ ప్రదేశాల్లో ఉంచడం వల్ల ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.

4. పెయింటింగ్ ఎలా ఉండాలి ?
గుర్రాల ఫోటోలను ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు గమనించండి.

గుర్రాల ముఖం: గుర్రాలు ఎప్పుడూ ఇంటి లోపలికి వస్తున్నట్లు ఉండాలి. ఇంటి బయటకు వెళ్తున్నట్లు ఉంటే అది సంపద బయటకు వెళ్తున్నట్లు అర్థం.

అన్నీ ఒకే వైపు: ఏడు గుర్రాలు కూడా ఒకే దిశలో పరిగెత్తుతున్నట్లు ఉండాలి. ఒక గుర్రం వెనక్కి తిరిగి చూడటం లేదా విడివిడిగా పరిగెత్తడం ఉండకూడదు.

ప్రశాంతమైన భావం: గుర్రాల ముఖాల్లో కోపం ఉండకూడదు. ప్రశాంతంగా.. ఉత్సాహంగా ఉండాలి. నీటిపై లేదా సూర్యోదయం నేపథ్యంలో పరిగెత్తే గుర్రాలు చాలా మంచివి.

పరిపూర్ణత: గుర్రాల ఫోటో ఎక్కడా చిరిగినట్లు లేదా అసంపూర్తిగా ఉండకూడదు. విరిగిన ఫ్రేమ్‌లను వాడకండి.

5. సంఖ్య:
ఏడు (7) సంఖ్యను శుభప్రదంగా భావిస్తారు (సప్తర్షులు, ఇంద్రధనస్సు రంగులు, ఏడు జన్మలు). అందుకే 7 గుర్రాలు ఉన్న పెయింటింగ్‌నే వాడాలి. ఒంటరి గుర్రం లేదా జంట గుర్రాల కంటే 7 గుర్రాల ఫోటో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×