BigTV English

YS Sharmila Comments: వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్‌ షర్మిల!

YS Sharmila Comments: వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్‌ షర్మిల!

YS Sharmila Comments On Cm Jagan: వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. జగన్ ప్రభుత్వం శిలా ఫలకాల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. రాష్ట్ర మంతా వైసీపీ మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఎటు చూసినా మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతున్నాయని ధ్వజమెత్తారు.


వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తానని జగన్ హామీ ఇచ్చారన్నారు. ఐదేళ్లలో ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని మండిపడ్డారు. 2008లో వైఎస్‌ఆర్‌ శిలాఫలకం వేస్తే.. అదే ప్రాజెక్టుకు జగన్‌ మరో శిలాఫలకం వేశారు తప్పా.. ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే జగన్ ప్రభుత్వం శిలా ఫలకాల ప్రభుత్వమని అన్నారు.

వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తే 80 వేల ఎకరాలకు సాగునీరు అందేదని తెలిపారు. రైతుల కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు కడతామని చెప్పి జగన్ మాట తప్పారని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి పేరు చెప్పి రైతులను మోసం చేశారని ఆరోపించారు. రైతును వైఎస్‌ఆర్‌ రాజును చేస్తే.. వైసీపీ హయాంలో రైతులు అప్పుల పాలయ్యారని మండిపడ్డారు. మూర్ఖులకు ఓటు వేయొద్దన్న ఆమె వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టేనన్నారు.


Also Read: YS Sunitha: త్వరలో.. హైకోర్టును ఆశ్రయిస్తా: వైఎస్ సునీత

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు షర్మిల. వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆలూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై తీవ్ర విమర్శలు చేశారు.జయరాంకు అభివృద్ధి మీద చిత్తశుద్ది లేదని ఆరోపించారు.

Tags

Related News

Kadapa Reddamma: జగన్ అడ్డాలో టీడీపీ అభ్యర్థి విజయం.. కడప రెడ్డమ్మ అంటూ చంద్రబాబు కితాబు!

Somireddy Chandramohan Reddy: జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి.. నెక్ట్స్ ప్లానేంటి..?

Jagan Record : ప్రతిపక్ష హోదా పోగొట్టుకుని జగన్ రికార్డ్.. టీమ్ 11 ఆడుదాం ఆంధ్ర

BIG TV Exit Polls Survey: జనం నాడి పట్టుకున్న బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీ నేతల్లో వణుకు

Nellore Constituency: నెల్లూరు లో షాకింగ్ సర్వే.. గెలిచేది ఎవరంటే..

Chandrababu Majority In Kuppam: కుప్పంలో చంద్రబాబు మెజార్టీ ఎంతంటే..?

Big Stories

×