Big Stories

YS Sunitha on Court Order: త్వరలో.. హైకోర్టును ఆశ్రయిస్తా: వైఎస్ సునీత!

YS Sunitha on Court Order: మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కడప జిల్లా కోర్టు ఉత్తర్వులివ్వగా..ఈ  అంశంపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ త్వరలోనే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆమె తెలిపారు. న్యాయం కోసం ప్రజల ముందుకు వస్తే.. ఏం చేయాలో తోచక వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారని సునీత ఆరోపించారు.

- Advertisement -

వివేకా హత్యకేసుపై తరుచూ పలువురు నేతలు మాట్లాడుతున్నాని వైసీపీ నేత కోర్టును ఆశ్రయించారు. వైఎస్‌ షర్మిల, వివేకా కుమార్తె సునీత, పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబునాయుడు, లోకేశ్‌, పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి తరచూ వివేకా హత్య గురించి మాట్లాడుతున్నారని కడప జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

- Advertisement -

ఈ కేసులో అవినాష్‌రెడ్డి హంతకుడిగానూ.. సీఎం జగన్‌ ,అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో వైసీపీ నేతల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసినట్లు ప్రకటించింది. అయితే కోర్టు ఉత్తర్వులపై సునీత స్పందించారు. వివేకా హత్య కేసుపై వైసీపీ నేతలు చాలాసార్లు మాట్లాడారని ఆమె అన్నారు.

Also Read: Pawan Nomination : పవన్ నామినేషన్ కు డేట్ ఫిక్స్.. కుప్పంలో నామినేషన్ వేసిన భువనేశ్వరి

వచ్చే ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలని సునీత ప్రజలను కోరారు. పులివెందులలో వైఎస్ సునీతా  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లలో మీడియా ముందు తన తండ్రి హత్య గురించి ఐదుసార్లు మాత్రమే మాట్లాడానని.. సునీత అన్నారు. రెండు నెలలుగా మాట్లాడడం మొదలు పెట్టానన్న ఆమె ఐదేళ్లుగా నరకం చూపించిన వైసీపీ నేతలు ఇప్పుడు న్యాయం కోసం ప్రజల ముందుకు వెళితే ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News