Big tv kissik Talks: అరియాన పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీకి యాంకర్ గా అడుగుపెట్టి యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఇలా ఈ కార్యక్రమంలో ఒకసారి కాకుండా రెండుసార్లు పాల్గొని సందడి చేసిన ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ వీడియోస్ అంటూ అంటూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. మరోవైపు పలు వెబ్ సిరీస్ లలో సినిమాలలో నటించే అవకాశాలను కూడా సొంతం చేసుకుంటున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అరియానా తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే లవ్ రిలేషన్ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఇప్పటివరకు తాను ఎవరితోనూ రిలేషన్ లో లేనని, సింగిల్గానే తన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని అరియానా తెలియజేశారు. ఎవరైనా నా జీవితంలోకి వస్తే బాగుండని ఎదురుచూస్తున్నాను కానీ సరైన వ్యక్తి దొరకలేదు అంటూ ఈమె మాట్లాడారు.
ఇలా సింగిల్ గా ఉన్నానని చెప్పడంతో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలని కోరుకుంటున్నావు అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అరియానా సమాధానం చెబుతూ తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ లిస్ట్ మొత్తం బయటపెట్టారు. లుక్స్ పరంగా తాను ఎప్పుడు ఎవరికీ ఇంపార్టెన్స్ ఇవ్వనని తెలిపారు. తనని బాగా అర్థం చేసుకునే వాళ్ళు అయితే చాలు ఎక్కడ ఉన్నా కూడా ఇతను నా వాడు అనే ఫీలింగ్ నాలో కలగాలి. అలాగే ఆ వ్యక్తితో నాకు ముందుగానే పరిచయం ఉండాలి అంటూ తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి తెలియజేశారు. ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానని అరియాన వెల్లడించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె లవ్ బ్రేకప్ గురించి కూడా మాట్లాడారు. ఇటీవల కాలంలో చాలా తొందరగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు అలాగే విడాకులు తీసుకుని విడిపోతున్నారు ఈ విషయాలు గురించి కూడా అరియనా మాట్లాడుతూ లవ్ బ్రేకప్ అయితే మీ మీద మీరు ఫోకస్ చేసి మీకోసం ఆలోచించుకోండి అంతేకానీ సూసైడ్ వంటి ఆలోచనలు మాత్రం ఎవ్వరు చెయ్యొద్దు నువ్వు నీ అనుమతి లేకుండానే జన్మించావు అలాగే చావు కూడా నీ చేతుల్లో ఉండదని, ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దని తెలియజేశారు.
Also Read: Big tv kissik Talks: ఆర్జీవీతో ఇంటర్వ్యూ.. బాధపడిన క్షణం లేదు..ఆయన వల్లే ఇదంతా!