Big Stories

Dubai Floods: ‘దుబాయ్ పర్యటనలను రీషెడ్యూల్ చేసుకోండి’.. భారత ఎంబసీ కీలక సూచనలు!

Indian Embassy Suggest to Reschedule Dubai Visit due to Floods: ప్రస్తుతం ఎడారి దేశం దుబాయ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో దుబాయ్ పర్యటనలు రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది.

- Advertisement -

దుబాయ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. దుబాయ్‌కు వచ్చేవారు.. అత్యవసరమైతే తప్ప ఇక్కడికి రావద్దని సూచించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు కూడా తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని కోరింది.

- Advertisement -

ప్రస్తుతం భారీ వర్షాలతో దుబాయ్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయని.. అక్కడి కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ సూచనలు పాటించాలని తెలిపింది. ఊహించని వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దీంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అక్కడి అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విమానాలు బయలుదేరే తేదీ, సమయానికి సంబంధించి సదురు విమానయాన సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించిన తర్వాతనే ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు రావాలని భారత రాయబారి కార్యాలయం సూచించింది.

Also Read: అదేంటి దుబాయ్‌లో ఆకాశం పచ్చరంగులోకి మారింది.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

వర్షాలు నేపథ్యంలో భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ప్రభుత్వం అత్యవసర హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. మరో రెండు రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే.. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News