E-Paper
Advertisement

Manam Re Release: ఏఎన్నార్ కన్నా.. చై- సామ్ విడాకుల గురించే మాట్లాడుకుంటారేమో నాగ్ మావా

Manam Re Release: ఏఎన్నార్ కన్నా.. చై- సామ్ విడాకుల గురించే మాట్లాడుకుంటారేమో నాగ్ మావా
Advertisement

Manam Re Release: ఈ మధ్య రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. అకేషన్ ఏదైనా.. స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు మేకర్స్. అప్పట్లో తమ అభిమాన హీరోల సినిమాలను థియేటర్ లో చూడలేకపోయామనే బాధతో ఉన్న ఫ్యాన్స్ .. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి థియేటర్ లో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోల హిట్ సినిమాలు ఎన్నో రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా మరో సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. అదే మనం.

అక్కినేని కుటంబం మొత్తం కలిసి నటించిన చిత్రం మనం. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగ్ నిర్మించాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు నుంచి అఖిల్ వరకు అక్కినేని కుటుంబం మొత్తం కనిపించారు. ఏఎన్నార్ చివరి చిత్రంగా ఈ సినిమా అందరి మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

Advertisement

2014 మే 23 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఏఎన్నార్ ఈ సినిమాలో నటించగలిగారు కానీ, చూడలేకపోయారు. అప్పటికే క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. తన కుటుంబం మొత్తం కనిపించే ఈ సినిమాలో ఎంత కష్టంగా ఉన్నా కూడా నటించి తన చివరి కోరిక నెరవేర్చుకున్నారు. మనం ప్రేక్షకుల ముందుకు వచ్చి రేపటితో 20 ఏళ్లు అవుతుంది. దీంతో 10 ఏళ్ల మనం ను సెలబ్రేట్ చేయడానికి మళ్లీ ఈ సినిమాను రేపు రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున అధికారికంగా ప్రకటించాడు.

ఇక అంతా బాగానే ఉంది కానీ, ఈ 10 ఏళ్లలో అక్కినేని ఇంట చాలా జరిగాయి. ఇందులో కలిసి నటించిన చై- సామ్ పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తరువాత విడిపోయారు. ఇప్పటికీ వీరిద్దరి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. మనం సినిమాలో వీరి నటన చూసి నిజంగానే ఈ జంట ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే చై.. సామ్ తో ప్రేమను అధికారికంగా ఒప్పుకున్నాడు.

Advertisement

వారిద్దరి మధ్య జరిగినఎన్నో మంచి మెమోరీస్ అని ఈ సినిమా చుట్టూనే ఉన్నాయి. రేపు ఈ సినిమా రీరిలీజ్ చేస్తే.. అందరూ ఏఎన్నార్ ను ఎలా అయితే తలుస్తారో.. కచ్చితంగా ఈ జంట గురించి మాట్లాడకుండా ఉండలేరు. రేపు మరోసారి చై- సామ్ కచ్చితంగా ట్రెండ్ లో ఉంటారని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి నెటిజన్స్ ఏం చేస్తారో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×