E-Paper
Advertisement

Bangladesh MP Murder: కోల్‌క‌తాలో బంగ్లాదేశ్ ఎంపీ హత్య.. ముగ్గురు అరెస్ట్

Bangladesh MP Murder: కోల్‌క‌తాలో బంగ్లాదేశ్ ఎంపీ హత్య.. ముగ్గురు అరెస్ట్
Advertisement

Bangladesh MP Murder: బంగ్లాదేశ్ ఎంపీ కోల్‌క‌తాలో దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌క‌తాలోని న్యూటౌన్ లో బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం దారుణంగా హత్య చేశారు. ఎంపీ అన్వరుల్ మే 12న మెడికల్ చెకప్ కోసం బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది.

అజీమ్ బంగ్లాదేశ్ లోని జెనైదా నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. కోల్ కతా పోలీసుల వివరాల ప్రకారం ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకు గురైనట్లు భావించిన భవనంలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై ఫోరెన్సిక్ విచారణ జరుగుతోంది. నిందితులు హత్య చేసి మృత దేహాన్ని సమీపంలోనే పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read:ఇరాన్ అధ్యక్షుడి మృతి విషయంలో స్పందించిన అమెరికా.. ఏం చెప్పిందంటే..?

ఇదిలా ఉంటే అన్వరుల్ హత్యను బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ధృవీకరించారు. అధికార పార్టీ ఎంపీని కోల్ కతాలో ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని..వారు బంగ్లాదేశీయులేనని చెప్పారు. హత్య కేసులో భారత పోలీసులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మే 12న వైద్య చికిత్సల కోసం ఎంపీ న్యూఢిల్లీ వచ్చారు. అనంతరం తన స్నేహితుడు గోపాల్ బిస్వాస్ నివాసానికి వచ్చారు. తర్వాత ఆయన అదృశ్యం అయ్యారు. దీంతో ఆయన స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×