BigTV English
Advertisement

Kalki2898AD: భైరవ.. బుజ్జి వచ్చేసిందిరోయ్.. కీర్తి సురేష్ అదరగొట్టింది

Kalki2898AD: భైరవ.. బుజ్జి వచ్చేసిందిరోయ్.. కీర్తి సురేష్ అదరగొట్టింది

Kalki2898AD: వచ్చేసింది.. వచ్చేసింది.. వచ్చేసిందిరోయ్.. ఎట్టకేలకు బుజ్జి వీడియో వచ్చేసింది. బుజ్జి ఎవరో తెలిసిపోయింది.. ప్రభాస్ జీవితంలో ఉన్న స్పెషల్ పర్సన్ ఎవరో తెలిసిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఇలానే ఉంది. మరి.. ఎన్నిరోజులు అవుతుంది కల్కి సినిమా నుంచి అప్డేట్ వచ్చి.. ఉదయం నుంచి ఎదురుచూస్తుంటే చివరికి ఇప్పుడు అప్డేట్ ఇచ్చారు. డై హార్ట్ ఫ్యాన్స్ అన్నాకా ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉండదా .. ? ఏంటి అంటే ఉంటుంది.. ఎందుకు ఉండదు.


సరే ఇదంతా పక్కన పెడితే ఇంతకు బుజ్జి ఎవరు.. దీపికానా.. ? దిశనా.. ? అంటే వీరెవరూ కాదు కీర్తి సురేష్. ఏంటీ.. కల్కిలో కీర్తి సురేష్ కూడా ఉందా.. ? అని ఆశ్చర్యపోకండి.. కీర్తి కేవలం తన గాత్రాన్ని మాత్రమే అందించింది. ఇక బుజ్జి అంటే మనిషి కాదు మావా.. కారు. భైరవ మాత్రమే వాడే కారు. భవిష్యత్ లో చూపించడానికి ఒక అద్భుతమైన కారును బుజ్జి పేరుతో తయారుచేశారు. ఆ తయారీ విధానాన్నీ ఒక వీడియో ద్వారా చూపించారు.

ఇక బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ను అందించగా .. అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక బుజ్జిని తయారుచేయడానికి టీమ్ అంతా ఎంత కష్టపడ్డారో.. కీర్తి సురేష్ తన ముద్దు ముద్దు మాటలతో వివరించింది. మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో.. బుజ్జిని కూడా ఓ బ్రెయినే అలా కంట్రోల్ చేస్తుంది.. అంటూ నాగి చెప్పుకొచ్చాడు. ఇక బుజ్జి బ్రెయిన్ ను కంట్రోల్ చేసేది భైరవనే అని చివర్లో చూపించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే.. బుజ్జి ఫుల్ బాడీని మే 22 న చూపించనున్నట్లు తెలిపారు.


ఇక బుజ్జి అంటే కేవలం వెహికల్ మాత్రమే కాదు.. ఒక సూపర్ హీరో అని కూడా చెప్పుకురావడంతో సినిమాలో ఈ కారుతో ప్రభాస్ మంచి స్టంట్స్ చేసే ఉంటాడని తెలుస్తోంది. మొత్తానికి రెండు రోజుల నుంచి అయోమయంలో పడేసిన బుజ్జి ఎవరో తెలిసిపోయింది. మరి బుజ్జి ఫుల్ బాడీ చూడాలంటే మాత్రం మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×