BigTV English

Joni Master Case : కిరాచక భార్యాభర్తలు… సాటి మహిళ కూడా కనికరించలే..

Joni Master Case : కిరాచక భార్యాభర్తలు… సాటి మహిళ కూడా కనికరించలే..

Johnny Master Case : ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు ఇప్పుడు మీడియాలో మారు మోగిపోతుంది. మొన్నటివరకు డ్యాన్స్ మాస్టర్ గా ఎన్నో సినిమాలకు కంపొస్ చేసిన ఆయన జాతీయ అవార్డు ను కూడా అందుకున్నాడు. ఇది అందరికీ కనిపించే జీవితం. కానీ మాస్టర్ చీకటి బాగోతం గురించి ఎవరికీ తెలియదు. పైకి నవ్వుతూ కనిపించే మాస్టర్ మనసు కామకోరికలతో నిండిపోయింది. కోరికను తీర్చుకోవడం కోసం వయసు, పేరు మర్చిపోయి ప్రవర్తించారనేది ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్.. మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయిన మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తుంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో మాస్టర్ అసలు రంగు బయట పడింది.. తాజాగా ఈ కేసులో మరో సంచలన నిజం బయటపడింది..


జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదయింది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఓ జూనియర్ డ్యాన్సర్ వేధింపులు తాళ్లలేక అతనిపై పోలీసు కేసు పెట్టింది. ఔట్ డోర్ షూటింగులలో తనపై అత్యాచారం చేశాడని యువతి పేర్కొంది. జీరో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఎన్నో సంచలన విషయాలను బయటకు తియ్యడమే కాదు.. గతంలో ఆయన పై ఉన్న కేసుల చిట్టాను కూడా బయటపెట్టారు. ఆ యువతి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారు..

జానీ మాస్టర్ భార్య సహకారం ఉందా?

A female dancer who told sensational truths about Johnny Master's wife
A female dancer who told sensational truths about Johnny Master’s wife

జానీ మాస్టర్ అమ్మాయిలను లైంగికంగా వేదింపులకు గురి చేశాడని పోలీసుల విచారణలో బయటపడింది.. గతంలో ఆయన పై చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏ భార్య అయిన భర్త తప్పు చేస్తే అస్సలు ఊరుకోదు.. కానీ ఈయన భార్య మాత్రం దగ్గరుండి భర్తతో దారుణాలు చేయించేదని మహిళా ఇచ్చినా స్టేట్మెంట్ తో బయటపడింది.. కీచక భార్యాభర్తలు కలిసే తనను వేధింపులకు గురి చేసినట్లు ఆ యువతి బయట పెట్టింది.


జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడా?

డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ చుట్టు ఉచ్చు బిగించుకుంది. తన దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న యువతి పై లైంగిక వేధింపులు గురిచేసేవారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడని తెలుస్తుంది. గత 24 గంటల నుంచి బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారిలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు ఆయనను పట్టుకొనేందుకు గాలిస్తున్నారని సమాచారం. ఇక ఇప్పటికే జానీ మాస్టర్ ను జనసేన దూరం పెట్టింది. ఇక ఇండస్ట్రీ కూడా ఆయనను బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైన మాస్టర్ దొరికితే గానీ అసలు నిజం బయటపడదు…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×