BigTV English
Advertisement

Political Celebrities: నష్ట జాతకులుగా మారిన సెలబ్రిటీస్.. మొన్న పృథ్వీ.. నేడు జానీ..!

Political Celebrities: నష్ట జాతకులుగా మారిన సెలబ్రిటీస్.. మొన్న పృథ్వీ.. నేడు జానీ..!

Political Celebrities.. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master)లైంగిక వేధింపుల ఆరోపణలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. దీంతో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం , సెలబ్రెటీలకు పొలిటికల్ కెరియర్ కలిసి రావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి . ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల్లో వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులే వీరిని రాజకీయంగా నష్ట జాతకులుగా మారుస్తోందని చెప్పవచ్చు. ఇక రాజకీయాలలో వేగంగా దూసుకుపోతూ మంచి పేరు సొంతం చేసుకోవాలనుకున్న పృథ్వీ, పోసాని తో పాటూ ఇప్పుడు జానీ మాస్టర్ కూడా లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా రాజకీయ భవిష్యత్తును కోల్పోయారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


పృథ్వీ రాజ్..

ఖడ్గం సినిమాతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అనే డైలాగ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు పృథ్విరాజ్. కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అంతేకాదు 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున జోరుగా ప్రచారం చేసి ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు ఏకంగా చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణల కారణంగా ఆ పదవి వీడాల్సి వచ్చింది. చెన్నైలో పృథ్వీ ఉన్నప్పుడు , ఈయనకు వరంగల్ నుంచి హైదరాబాదులో సెటిల్ అయిన దాసరి పద్మ రేఖ అనే మహిళతో పరిచయం ఏర్పడి, ఆమెతోనే ఉంటున్నారని వార్తలు వినిపించాయి. భార్యతో గొడవ పడి ఆయన ఆమెతో ఉండడం ఆయన రాజకీయ జీవితానికి అడ్డుగా మారింది. పృద్వీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పించారు. అప్పట్లో పృథ్వి కి సంబంధించిన ఒక ఆడియో కాల్ కూడా సెన్సేషన్ గా మారింది. అయితే ఈ విషయంలో తనపై కుట్ర జరిగిందని కూడా అప్పట్లో తెలియజేశారు పృథ్వీ.

పోసాని..

సినిమాలలో కమెడియన్ గా, నటుడిగా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి రాజకీయాలలో సత్తా చాటడానికి జగన్ హయాంలో వైసిపి పార్టీలోకి చేరారు. అక్కడ పార్టీ కోసం జోరుగా ప్రచారాలు చేపట్టిన ఈయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆయనపై జరిగిన ఆరోపణల కారణంగా ఆయనను ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది.


జానీ మాస్టర్..

తాజాగా 21 సంవత్సరాల మహిళ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడ్డ జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.ఇలా లైంగిక ఆరోపణలు వినిపిస్తూ ఉండడం పైగా జానీ మాస్టర్ పై ఎఫ్ ఐ ఆర్ కేస్ ఫైల్ అవ్వడంతో జనసేన పార్టీ నుండి తాజాగా ఆయనను సస్పెండ్ చేశారు. గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్న జానీ మాస్టర్ పై ఇప్పుడు లైంగిక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన అధిష్టానం తక్షణమే పార్టీకి దూరంగా ఉండాలని.. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది.

అలీ:

Political Celebrities: Celebrities who have become fortune tellers.. Yesterday Prithvi.. Today Johnny..!
Political Celebrities: Celebrities who have become fortune tellers.. Yesterday Prithvi.. Today Johnny..!

కమెడియన్ గా , నటుడిగా, హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్న ఆలీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. 2019లో వైఎస్ఆర్సిపి లో చేరిన ఈయన 2022 అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితుడయ్యాడు. అయితే 2024 జూన్ 28 న పదవిని వదిలి రాజకీయాలకు దూరంగా వచ్చేశారు.

 

ఇలా వీరంతా కూడా రాజకీయాలలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వెళ్లి పలు ఆరోపణల కారణంగా తమ పదవులకు రాజీనామా చేసి, రాజకీయ జీవితానికి స్వస్తి పలికారు. మొత్తానికి అయితే ఈ సెలబ్రిటీలందరూ రాజకీయపరంగా నష్టజాతకులు అని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×