E-Paper
Advertisement

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో త‌మ‌న్ రేర్ రికార్డ్‌

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో త‌మ‌న్ రేర్ రికార్డ్‌
Advertisement

Pawan Kalyan latest movie updates(Latest tollywood news) : ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల విషయంలో మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్‌కు ఓ రికార్డ్ క్రియేట్ అయ్యింది. అవును నిజ‌మే! ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కు 26 సినిమాలు పూర్తి చేశారు. మ‌రో నాలుగు సినిమాల‌ను సెట్స్‌లో ఉంచారు. ఈ ట్రాక్ రికార్డ్‌లో ఆయ‌న చాలా మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌తో ఆయ‌న ప‌ని చేశారు. అయితే ఎవ‌రికీ సాధ్యం కానీ రికార్డ్ మాత్రం త‌మ‌న్‌కే సొంతమైంది. ఇంత‌కీ ఏంటా రికార్డ్! అనే వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తోనూ వ‌రుసగా మూడు సినిమాల‌కు ప‌ని చేయ‌లేదు. కానీ త‌మ‌న్‌తో మాత్ర‌మే వ‌రుస మూడు సినిమాల‌కు వ‌ర్క్ చేశారు.

Advertisement

రాజ‌కీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..ముందుగా చేసిన సినిమా వ‌కీల్ సాబ్‌. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. ప‌వ‌న్ మాస్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు త‌మ‌న్ ఇచ్చిన పాట‌లు, నేప‌థ్య సంగీతం ఫ్యాన్స్‌కే కాదు, సినీ ప్రేక్ష‌కుల‌కు కూడా న‌చ్చింది. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస సినిమాల్లో త‌మ‌న్‌కు అవ‌కాశం ఇచ్చారు. అందులో రెండో సినిమా భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమాలోనూ త‌మ‌న్ కంపోజ్ చేసిన‌ పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

కాగా.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో. ప‌వ‌న్‌తో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి చేస్తోన్న సినిమా. ఈ సినిమాను జూన్ 28న రిలీజ్ కానుంది. నిజానికి ప‌వ‌న్ ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో ఆల‌స్యంగా స్టార్ట్ అయిన బ్రో సినిమా.. రిలీజ్ విష‌యంలో మాత్రం ముందుకు వ‌చ్చేసింది. సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. త‌మిళ చిత్రం వినోద‌య సిత్తంకు ఇది రీమేక్‌. స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×