BigTV English
Advertisement

Apple’s new headset : యాపిల్ కొత్త హెడ్‌సెట్.. సరికొత్త టెక్నాలజీతో..

Apple’s new headset : యాపిల్ కొత్త హెడ్‌సెట్.. సరికొత్త టెక్నాలజీతో..


Apple’s new headset : ‘యాపిల్’.. ఏ ప్రొడక్ట్‌ను తయారు చేసిన కొత్తగానే ఉంటుంది. వినూత్నంగా ప్రొడక్ట్స్‌ను, గ్యాడ్జెట్స్‌ను ప్రజలకు అందించాలి అనుకుంటుంది కాబట్టే మిగతా వాటితో పోలిస్తే యాపిల్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కంపెనీ మరొక కొత్త గ్యాడ్జెట్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అదే మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్. యాపిల్.. ఇది తన డ్రీమ్ ప్రొడక్ట్‌గా ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు ఇది మార్కెట్లోకి వచ్చేసింది.

మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ (ఎమ్మార్) అనేది వర్చువల్ రియాలిటీకి కొత్త అర్థాన్ని తీసుకొని రావడానికే ప్రవేశపెట్టినట్టుగా ఉందని ఇప్పటికే కొందరు టెక్ నిపుణులు ప్రశంసలు మొదలుపెట్టేశారు. ప్రస్తుతం వర్చువల్ రియాలిటీలో మార్క్ జుకెన్‌బర్గ్ తయారు చేసిన మెటావర్స్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన ప్రపంచంగా మారిపోయింది. ఇప్పుడు ఇదే సామర్థ్యంతో ఎమ్మార్ హెడ్‌సెట్ అనేది మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీంతో టెక్నాలజీ రంగంలో ఈ రెండిటి మధ్య గట్టి పోటీ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.


ప్రస్తుతం ఎమ్మార్ హెడ్‌సెట్‌కు 3000 డాలర్ల ప్రైజ్‌ను నిర్ణయించాలని యాజమాన్యం అనుకుంటోంది. కానీ మరోవైపు ఇలాంటి హెడ్‌సెట్ అనేది ఇప్పటివరకు మార్కెట్లో లేదు కాబట్టి ఈ ప్రైజ్‌ను మరింత పెంచవచ్చు అని కూడా భావిస్తోంది. మెటా ప్రపంచంతో పోలిస్తే ప్రస్తుతం వర్చువల్ రియాలిటీ అనేది చాలా చిన్నగా మారిపోయింది. కనీసం ఈ హెడ్‌సెట్ అయినా వర్చువల్ రియాలిటీ ప్రపంచానికి ఒక ప్రోత్సాహంగా పనిచేస్తుందని నిపుణులు అనుకుంటున్నారు.

ఇప్పటికే యాపిల్ తయారు చేస్తున్న ఐఫోన్స్, ఐప్యాడ్స్, మాక్స్, వాచ్ వంటి వాటికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అదే విధంగా ఎమ్మార్ హెడ్‌సెట్స్‌కు కూడా అప్పుడే క్రేజ్ మొదలయిపోయింది. యాపిల్ వాచ్ తర్వాత తాము గర్వంగా ఫీల్ అవుతున్న ప్రొడక్ట్ ఇదే అని యాపిల్ యాజమాన్యం సైతం ప్రకటించింది. అయితే ఈ హెడ్‌సెట్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏర్ నుండి వీఆర్‌ను మారే ఫీచర్ ఉందని యాజమాన్యం బయటపెట్టింది. ఒకవేళ ఈ హెడ్‌సెట్ పెట్టుకొని ఫేస్‌టైమ్ కాల్స్ మాట్లాడాలి అనుకున్నప్పుడు మనిషి మొహంతో పాటు పూర్తి బాడీని కూడా వర్చువల్ రియాలిటీలో చూసే సౌలభ్యం కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది.

ఒక్క ఏడాదిలోని 1 మిలియన్ హెడ్‌సెట్స్‌ను అమ్మాలని యాపిల్ టార్గెట్‌గా పెట్టుకున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఇప్పటివరకు ఏఆర్ టెక్నాలజీకి, వీఆర్ టెక్నాలజీకి వేర్వేరుగా హెడ్‌సెట్స్ అందించిన యాపిల్.. ఇప్పుడు ఈ రెండు టెక్నాలజీలను ఒకే హెడ్‌సెట్‌లో ఇవ్వడం ఆసక్తికరంగా ఉందని యాపిల్ రెగ్యులర్ యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాపిల్ ప్రొడక్ట్‌ను చూసి మరికొన్ని టెక్ కంపెనీలు కూడా ఇదే ఐడియాతో ముందుకొస్తే.. వీఆర్ టెక్నాలజీకి మంచి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×