E-Paper
Advertisement

Aadi Sai Kumar: కృష్ణ ఫ్రమ్ బృందావనం నుంచి అయినా హిట్ వస్తుందా.. ?

Aadi Sai Kumar: కృష్ణ ఫ్రమ్ బృందావనం నుంచి అయినా హిట్ వస్తుందా.. ?
Advertisement

Aadi Sai Kumar: ప్రేమ కావాలి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా అలాంటి హిట్ ను అందుకోలేకపోయాడు. ఇక అలా అని అవకాశాలు రావడం లేదా.. ? అది కూడా కాదు. ఇప్పటివరకు ఆది.. మంచి కథలను ఎంచుకొని సినిమాలు తీస్తూ వచ్చాడు. కానీ, అతనికి లక్ కలిసిరాలేదు. అయితే ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని కసితో ఒక సినిమాను మొదలుపెట్టాడు. అదే కృష్ణ ఫ్రమ్ బృందావనం.

వీరభద్ర చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆది సరసన దిగంగనా సూర్యవంశీ నటిస్తోంది. ఆది- వీరభద్ర చౌదరి కాంబోలో ఇప్పటికే చుట్టాలబ్బాయి అనే సినిమా వచ్చింది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అయితే అందుకుంది కానీ, కలక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఇక చాలా కాలంతరువాత ఈ కాంబో రిపీట్ అయ్యింది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు కాకతీయ హిల్స్‌ లోని వెంకటేశ్వర ఆలయంలో గ్రాండ్ గా జరిగాయి.

Advertisement

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఈ పూజకు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌ కు దిల్ రాజు క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి స్క్రిప్ట్ అందజేశాడు. కెమెరాను సాయి కుమార్ స్విచ్ ఆన్ చేశాడు. “వీరభద్రంతో మరో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు మంచి కథ దొరికింది. కుటుంబం మొత్తం నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. జూన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది” అని ఆది సాయి కుమార్ చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతోనైనా అతనికి హిట్ వస్తుందా.. ? లేదా ..? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×