BigTV English

Aamir Khan: అదెలా గురూ… ఇద్దరు మాజీ భార్యల ముందు కొత్త లవర్ తో ఎంజాయ్ చేస్తున్నావ్?

Aamir Khan: అదెలా గురూ… ఇద్దరు మాజీ భార్యల ముందు కొత్త లవర్ తో ఎంజాయ్ చేస్తున్నావ్?

Aamir Khan: నందమూరి బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో టైటిల్ సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఇప్పటికీ కొంతమంది ఈ సాంగ్ వింటూనే ఉంటారు. “ద్వాపరమంతా సవతుల సంతా, జ్ఞాపకముందా గోపాలా, కలియుగమందూ ఇద్దరి ముందూ, శిలవయ్యావే స్త్రీలోల, కాపురాన ఆపదలని ఈదిన శౌరీ, ఏదీ నాకూ చూపవా ఒక దారీ, నారీ నారీ నడుమ మురారీ, నారీ నారీ నడుమ మురారీ…” ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కున ప్రతి మగాడికి ఈ పాట లిరిక్స్ వర్తిస్తాయి కానీ నాకు మాత్రం కాదు అంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.


మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరున్న బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, గత కొన్నేళ్లుగా హీరోయిన్ ఫాతిమా సన షేక్ తో ప్రేమలో ఉన్నాడు అనే వార్త బాలీవుడ్ లో వినిపిస్తూనే ఉంది. ఆమిర్ ఖాన్ కూతురి పెళ్ళిలో కూడా ఫాతిమా కనిపించడంతో ఈ రూమర్స్ నిజమయ్యాయి కానీ ఆమిర్ ఖాన్ మాత్రం అఫీషియల్ గా ఎక్కడా అనౌన్స్ చేయలేదు. అయితే లేటెస్ట్ గా అందరికీ షాక్ ఇస్తూ…  తన 60వ పుట్టినరోజు సందర్భంగా కొత్త గర్ల్ ఫ్రెండ్ “గౌరీ స్ప్రాట్‌”తో ఉన్తోన రిలేషన్ ని ఆమిర్ ఖాన్ ప్రకటించాడు. “గౌరీతో 25 ఏళ్ల పరిచయం ఉంది, గత ఏడాది నుంచి డేటింగ్ చేస్తున్నాను” అని ఆమిర్ ప్రకటించాడు. సగం తమిళ, సగం ఐరిష్ వారసత్వం కలిగి ఉన్న గౌరీకి ఇప్పటికే ఆరేళ్ల కొడుకు కూడా ఉండడం విశేషం.

ఫాతిమా సనతో కాకుండా గౌరీతో ప్రేమని అనౌన్స్ చేయడమే షాక్ ఇచ్చే విషయం అంటే అంతకు మించి అన్నట్లు… కొత్త ప్రేయసితో పాటు ఇద్దరు మాజీ భార్యలతో ఒకేసారి కలిసి కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు ఆమిర్ ఖాన్. ఇటీవల క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వెడ్డింగ్ యానివర్సరికి ఆమిర్ ఖాన్,  గౌరీతో పాల్గొన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటీ అంటే… ఆమిర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు కూడా ఆ వేడుకలో హాజరయ్యారు. ఇద్దరు మాజీ భార్యలు ఉండగా, వాళ్లిద్దరి ముందు ఆమిర్ తన కొత్త లవర్ తో ఆనందంగా గడపడం, మాజీ భార్యల సమక్షంలో కూడా సంతోషంగా ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సార్ అసలు ఇదెలా సాధ్యం సార్? అల ఎలా మేనేజ్ చేస్తున్నారు సర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.


నిజానికి ఆమిర్ ఖాన్ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ వైఫ్ తో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2024లో తన కుమార్తె ఐరా ఖాన్ వివాహంలో, ఆమిర్ తన రెండో భార్య కిరణ్ రావుతో కలిసి డాన్స్ చేశాడు, ఈ వేడుకలోనే ఫాతిమాతో కలిసి ఆమిర్ కనిపించాడు. ఏదేమైనా ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అటు సినిమాలని, ఇటు పర్సనల్ లైఫ్ ని భలే బాలన్స్ చేస్తున్నాడు. విడిపోయిన తర్వాత కూడా భార్యలతో స్నేహపూర్వకంగా ఉండడం ఆమిర్ ఖాన్ కి మాత్రమే చెల్లింది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×