IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పూర్తికాగానే… ఇప్పుడు అందరి చూపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పైన ( Indian Premier League 2025 Tournament) పడింది. ఈ టోర్నమెంట్ కు వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో… అన్ని జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు రెడీ అవుతున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇలాంటి నేపథ్యంలో… మొదటిసారి ఛాంపియన్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు ( Rajasthan Royals ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
Also Read: WPL 2025: డబ్ల్యూపీఎల్ ఛాంపియన్ గా ముంబై….ప్రైజ్ మనీ ఎంతంటే ?
ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ( Sanju Samson ) రాజస్థాన్ రాయల్స్ కు దూరం కాబోతున్నాడని సమాచారం అందుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్… కంటే ముందే.. చాలా మంది ప్లేయర్లు గాయాల పాలు అయ్యారు. అందులో కొంతమంది కోలుకుంటూ ఉంటే.. మరి కొంతమంది… ఇంకా ఫిట్నెస్ టెస్టులు పాస్ కావడం లేదు. అయితే ఈ లిస్టులోకి.. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా చేరిపోయారు. మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని ఎదుటి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజుకు బెంగళూరులోని ఎన్సీఏ సెంటర్ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదని సమాచారం అందుతుంది.
దీనికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. అయితే మార్చి 22వ తేదీ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమైన మరుసటి రోజు… రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో… రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు దూరం అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. బెంగళూరులోని ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ వస్తేనే… జట్టులోకి సంజు వస్తాడు. ఒకవేళ సంజు ఆడినా కూడా బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని తెలుస్తోంది.
Also Read: JioStar – IPL 2025: IPL 2025తో అంబానీ పంట పండటం ఖాయం..10 సెకన్లకు రూ.20 లక్షలా?
వికెట్ కీపర్ గా బాధ్యతలు నుంచి అతను తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి సంజు తప్పుకుంటే ధృవ్ జురెల్ ఆ బాధ్యతలు తీసుకుంటాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals ) మధ్య మ్యాచ్ కు సంజు దూరమైతే.. కెప్టెన్ ఎవరు అవుతారు అనే దాని పైన కూడా చర్చ జరుగుతుంది. సంజూ శాంసన్ ( Sanju Samson ) ఒకవేళ మొదటి మ్యాచ్ ఆడకపోతే… రియాన్ పరాగ్ కెప్టెన్ గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే.. రెండో మ్యాచ్ సమయానికి సంజూ శాంసన్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు.