E-Paper
Advertisement

Actor : కూతురిని వేధించిన నటుడు… కేసులో నటుడు అరెస్ట్.. వెలుగులోకి కీలక అంశాలు..!

Actor : కూతురిని వేధించిన నటుడు… కేసులో నటుడు అరెస్ట్.. వెలుగులోకి కీలక అంశాలు..!
Advertisement

Actor : సినీ ఇండస్ట్రీలో చాలామంది పేరు మోసిన నటీనటులు అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ, అందరి చేత ఛీ కొట్టించుకోకూడదు. ఎంతోమంది అభిమానులు ఉండి సమాజంలో గౌరవ మర్యాదలు కలిగి ఉన్న కొంతమంది నటులు తప్పుడు పనులు చేస్తూ అందరి ముందు తలదించుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఆడవారి విషయంలో అసభ్యకరంగా ప్రవర్తించి జైలు పాలైనా.. మిగతా వారికి బుద్ధి రాలేదేమో తెలియదు కానీ కుటుంబ సభ్యుల విషయంలో కూడా దురుసుగా ప్రవర్తిస్తూ జైలు పాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక నటుడిపై ఆయన మాజీ భార్య పోలీస్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

పరువు నష్టం కేసులో మలయాళ నటుడు అరెస్ట్..

Advertisement

మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన బాలా కుమార్… తమిళ సినిమాలలో తన పాత్రతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈయనను.. మాజీ భార్య అమృత సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మలయాళ నటుడు బాలా కుమార్ (Bala Kumar) ను ఆయన మాజీ భార్య ప్రముఖ గాయని అమృతా సురేష్ (Amrutha Suresh) ఫిర్యాదు మేరకు కేరళలోని ఎర్నాకులంలో ఉన్న కడవంత్రా పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా ద్వారా తనతో పాటు తన కుమార్తె పరువు తీస్తున్నాడు అంటూ బాలా మాజీ భార్య అమృత సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు ఫైల్ చేసి బాలాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

బాలా కీచకుడు.. ప్రత్యక్ష సాక్షి డ్రైవర్..

ఈ విషయంపై బాలా దగ్గర గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న డ్రైవర్ విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. “బాలా తన కుమార్తె అవంతిక ముందే అమృతపై చాలా సార్లు దాడి చేశాడు. పాప వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమృతపై దాడి చేయడం నేను కూడా చేశాను” అంటూ ఆ డ్రైవర్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం బాలా, అమృత సురేష్ విడిపోయారు కాబట్టి ఈ విషయాన్ని బయట పెడుతున్నాను అంటూ వారి డ్రైవర్ చెప్పుకొచ్చారు. “అమృత సురేష్ పట్ల బాలా చాలా అమానుషంగా ప్రవర్తించాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆమెపై దాడి చేయడం వల్ల ఆమె శరీరంపై గాయాల తాలూకు మచ్చలు కూడా ఉన్నాయి. వాటికి ఇప్పటికీ చికిత్స తీసుకుంటుంది” అంటూ డ్రైవర్ తెలిపారు. అంతేకాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వారి డ్రైవర్ పంచుకున్నారు.

భార్యపై బాలా ఆరోపణలు..

ఇదిలా ఉండగా మరొకవైపు.. తన కుమార్తెను తన వద్దకు రాకుండా అమృత అడ్డుకుంటుందని బాలా ఆరోపణలు చేశారు. అయితే అవంతిక ఈ విషయంపై ఒక వీడియో కూడా పంచుకుంది. అందులో అమృత మాట్లాడుతూ నాతో నా కూతురితో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన వీడియోలతో నా కుమార్తెను మానసికంగా దెబ్బతీస్తున్నాడు అంటూ అమృత సురేష్ చెప్పుకొచ్చింది.

బాల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..

బాలా విషయానికి వస్తే.. 2002లో తెలుగు చిత్రం టూ మచ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత 2003లో తమిళంలో అన్బు అనే చిత్రంలో నటించి అక్కడ కూడా ఆకట్టుకున్నారు. ఇక ఈయన తండ్రి 350 కి పైగా సినిమాలు చేసి , డాక్యుమెంటరీలకు దర్శకత్వం కూడా వహించారు. ఈయన సోదరుడు శివ కూడా చిత్ర నిర్మాత అలాగే సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈయన తాత అరుణాచల స్టూడియోస్ యజమాని. ఇంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ పెట్టుకున్న బాల ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×