BigTV English

Chalaki Chanti : ఇకపై కామెడీ షోకు దూరం… వాళ్ళు సర్వనాశనం కావాలంటూ చంటి శాపనార్థాలు

Chalaki Chanti : ఇకపై కామెడీ షోకు దూరం… వాళ్ళు సర్వనాశనం కావాలంటూ చంటి శాపనార్థాలు

Chalaki Chanti : ‘జబర్దస్త్’ అనే కామెడీ షోతో పాపులర్ అయిన కమెడియన్లలో చలాకీ చంటి కూడా ఒకరు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న చంటికి జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కింది. కొన్నేళ్ల పాటు ఈ షోలో హవా చూపించిన ఆయన రీసెంట్ గా పూర్తిగా షోకు దూరమయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొని కొన్ని రోజులకే ఎలిమినేట్ అయ్యాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంటి ఇప్పుడు పూర్తిగా కోల్కొని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టారు.


ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు…

తనకు గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదంటూ తాజాగా చంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. తను ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొందరు మాత్రమే ఫోన్ చేసి జాగ్రత్త అని మాత్రమే చెప్పారని, ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదని చెప్పుకొచ్చాడు. డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బ్రతుకుతామని, లేదంటే ఎవ్వరూ పట్టించుకోరు, హెల్ప్ చేయరని చెప్పుకొచ్చిన చంటి ప్రతి ఆర్టిస్ట్ జీవితం ఇలాగే ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా సంపాదించేస్తున్నారు అనుకుంటారు కానీ ఎంత సంపాదిస్తున్నారు అనేది ఎవరికీ తెలియదని అలాగే ఫ్రెండ్స్ అయినప్పటికీ ఎవ్వరూ సాయం చేయరు కాబట్టి అవతలి వ్యక్తి దగ్గర సాయం ఆశించకూడదంటూ చంటి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.


జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ లేదు

చాన్నాళ్ల తర్వాత ఇంటర్వ్యూతో ఆడియన్స్ ముందుకు వచ్చిన చంటిని మళ్లీ జబర్దస్త్ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ చేయనని చెప్పారు. “వాళ్లే వద్దు అని చెప్పారు. ఎందుకలా అన్నారో కూడా తెలీదు. వద్దు అన్నాక మళ్లీ నేను వెళ్ళను అడగను. అందరూ దీన్ని ఈగో అనుకున్నప్పటికీ దాన్ని ‘సెల్ఫ్ రెస్పెక్ట్’ అని కూడా అంటారు. ఈగో అనేది అందరికీ ఉంటుంది. వాళ్ళు వద్దన్నాక నేను అడగడం కరెక్ట్ కాదు. అందుకే మళ్ళీ జబర్దస్త్ చేయను” అంటూ వివరించారు. కానీ దానికి కారణం ఏంటో మాత్రం వెల్లడించలేదు.

ఇక ఈ ఇంటర్వ్యూలోనే తనకు ఈగో ఉందని, షూటింగ్స్ వస్తే కొన్ని అడుగుతాడని కొంతమంది సంబంధం లేని విషయాల్లో తనను ఇరికించి, రావాల్సిన ఛాన్సులు రాకుండా చేశారంటూ చంటి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనకలా అవకాశాలు రాకుండా చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారని, తను బతికుండగానే వాళ్ళ నాశనం అవ్వడం చూడాలని, ఆ తర్వాత చచ్చిపోవాలని రోజూ దేవుని కూడా కోరుకుంటున్నాను అంటూ  శాపనార్థాలు పెట్టారు.. ఓ డైరెక్టర్ ని పేరు పెట్టి పిలిచినందుకు చుట్టుపక్కన వాళ్ళు నెగిటివ్ చేసి, ఆ సినిమాలో తన క్యారెక్టర్ లేకుండా చేశారని, ఇలా ఇప్పటి దాకా చాలా అవకాశాలు పోయాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం చంటి ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×