Actor Chandu Wife Reveals Sensational Facts: సీరియల్ నటి, నటుడు.. పవిత్ర జయరాం – చందూలే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. పవిత్ర జయరాం రోడ్డుప్రమాదంలో మరణించిన తర్వాత చందు ఆమె గురించి చేసిన పోస్టులు చూసిన నెటిజన్లు వారిద్దరూ నిజమైన భార్యభర్తలే అనుకున్నారు. కానీ.. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని తెలిసి షాకయ్యారు. పవిత్రకు, చందుకు వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లై పిల్లలు కూడా ఉన్నారు. కానీ.. పవిత్ర జయరాం భర్తకు దూరంగా పిల్లలతో ఉంటోంది. ఇంతలో పవిత్రతో చందుకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
పవిత్ర మరణం తర్వాత.. చందు కూడా ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేనంటూ.. మే 17న రాత్రి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా చందు ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించింది. చందు బలవన్మరణానికి సంబంధించిన సంచలన విషయాలను ఆమె బయటపెట్టింది. పవిత్రకు- చందుకు వివాహేతర సంబంధం ఉన్న మాట నిజమేనని తెలిపారామె. ఆమె వల్లనే చందు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని వాపోయింది.
తమ దాంపత్య జీవితం చాలాకాలం అన్యోన్యంగానే సాగిందని, చందు జీవితంలోకి పవిత్ర ఎంటర్ కావడంతోనే తామిద్దరి మధ్య దూరం పెరిగిందన్నారు. తమ వివాహ బంధానికి గుర్తుగా ఎనిమిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని తెలిపారు. పవిత్ర వల్ల విభేదాలు తలెత్తాయని, నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నామని తెలిపారు. పిల్లలతోనే కాంటాక్ట్ లో ఉండేవాడని, ఎప్పటికైనా మనసు మార్చుకుని తిరిగి వస్తారని ఎదురుచూస్తున్నానని తెలిపారు.
Also Read: చందు సూసైడ్.. ఆత్మహత్యకు ముందు పోస్ట్.. వద్దని వారించిన సన్నిహితులు
గురువారం ఉదయం ఫోన్ చేసి.. ఇంటికి తిరిగి రావాలని ఎంత బ్రతిమాలినా ఆయన రాలేదన్నారు. పవిత్ర చనిపోయిన బాధలో ఉన్నారు.. కాస్త కుదుటపడ్డాక వస్తారనుకున్నాం కానీ.. ఇలా ఆత్మహత్య చేసుకుంటారని అనుకోలేదని భార్య శిల్ప చెప్పారు. చందు సోదరి శ్రావణి మాట్లాడుతూ.. తన అన్నయ్య ఎంతో ధైర్యవంతుడని అనుకున్నామని.. పవిత్ర కారణంగా ఇలా చనిపోతాడని ఊహించలేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఏదేమైనా.. పవిత్ర- చందు మరణాలు బుల్లితెర ఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టేశాయి.