BigTV English

Trinayani Chandu WhatsApp Chat: పవిత్ర పిలుస్తోంది.. కన్నీళ్లు పెట్టిస్తున్న చందు వాట్సప్ చాట్!

Trinayani Chandu WhatsApp Chat: పవిత్ర పిలుస్తోంది.. కన్నీళ్లు పెట్టిస్తున్న చందు వాట్సప్ చాట్!

Trinayani Serial Artist Chandu WhatsApp Chat: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినయని సీరియల్ తో పాటు పలు సినిమాల్లో చందు నటించాడు. 2015లో చందు.. శిల్ప అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న చందు పవిత్ర జయరాంతో సహజీవనం చేస్తున్నాడు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్‌లో చందు నటిస్తున్నాడు.


ఇటీవలే త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. భర్తకు దూరంగా ఉంటున్న పవిత్రకు 22 ఏళ్ల కొడుకు, 19 ఏళ్ల కూతురు ఉన్నారు. పవిత్ర మృతిని తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు.. ఈ రోజు పవిత్ర బర్త్ డే.. మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు.. వెళ్దాం రా అని సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు.

Also Read: Pavitra Jayaram Died: షాకింగ్.. త్రినయని సీరియల్ నటి దుర్మరణం..!


సన్నిహితులతో వాట్సాప్ లో జరిపిన చాట్ లోనూ.. ఇక తను వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని, వెళ్లిపోవడమే కరెక్ట్ అని మెసేజ్ లు పంపాడు. అలాంటి పనులు చేయొద్దని వారించినా చందు వినలేదు. పవిత్ర రమ్మంటోంది వెళ్తానని మెసేజ్ లు పంపాడు.

పవిత్ర జయరాం మరణించిన తర్వాత.. చందు ప్రతిరోజూ ఆమె గురించి పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఒక్కసారి మామ అని పిలువే.. నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. తమ రిలేషన్ ను పెళ్లి వరకూ తీసుకెళ్లాలనుకుంటుండగా.. అంతలోనే తనను వదిలేసి వెళ్లిపోయిందని ఆవేదన చెందాడు చందు. చందు ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×