BigTV English

Avengers – Iron Man: మార్వెల్ అవెంజ‌ర్స్‌లోకి ఐరన్‌మ్యాన్ ఎంట్రీ.. ఈసారి హీరోగా కాదు..!

Avengers – Iron Man: మార్వెల్ అవెంజ‌ర్స్‌లోకి ఐరన్‌మ్యాన్ ఎంట్రీ.. ఈసారి హీరోగా కాదు..!

Avengers – Iron Man: హాలీవుడ్ సినిమాలంటే ఇండియన్ సినీ ప్రియులకు ఆసక్తి ఎక్కువే. ఆ ఇండస్ట్రీ నుంచి కొత్త కొత్త సినిమాలు ఏమైనా వస్తున్నాయా లేదా అని తరచూ సెర్చ్ చేస్తూ ఉంటారు. అందులోనూ మార్వెల్ మూవీస్ అంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలివారి వరకు హాలీవుడ్ మార్వెల్ మూవీస్ అంటే పడిచచ్చిపోతారు. అందులో ఉండే యాక్షన్ అండ్ అడ్వెంచరస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇటీవలే అలాంటి సినిమా ఒకటి వచ్చి అదరగొడుతుంది. అదే ‘డెడ్‌పూల్ & వుల్వరిన్’ మూవీ.


‘డెడ్‌పూల్ & వుల్వరిన్’ హాలీవుడ్ మూవీ ఇటీవలే రిలీజ్ అయి అటు హాలీవుడ్ లోనూ ఇటు భారతీయ సినీ ప్రియుల్లోనూ ఫుల్ జోష్ నింపింది. ఇందులో సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు అందించి అదరగొట్టేశారు. దీంతో హాలీవుడ్‌ నుంచి వచ్చిన ఈ సినిమా యావత్ ప్రపంచ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇదిలా ఉంటే హాలీవుడ్‌ సూపర్ హీరో ఫ్రాచైజీలో అవెంజర్స్‌‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ ఫ్రాంచైజీ సినిమాలంటే ప్రేక్షకులకు పిచ్చి. తరచూ చూసేందుకు విసిగిపోరు. అలాంటి ఫ్రాంచైజీ నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. అవెంజర్స్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన లాస్ట్ మూవీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ఎంతటి ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ క్లైమాక్స్‌లో అవెంజర్స్ స్టోరీ ముగిసినట్లు తెలిపారు. దీంతో మార్వెల్ అభిమానులు చాలా ఫీలయ్యారు. కానీ అలాంటి వారికోసం మేకర్స్ అదిరిపోయే వార్త అందించారు.


Also Read: ఆ దర్శకుడితో పవన్ కల్యాణ్ సినిమా.. నిర్మాత క్లారిటీ.. కంగారు పడుతున్న ఫ్యాన్స్..!

అవెంజర్స్ ఫ్రాంచైజీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే రెండు సినిమాలను అధికారికంగా అనౌన్స్ చేశారు. అందులో ‘అవెంజర్స్ డూమ్స్ డే’ ఒకటి కాగా.. మరొకటి ‘అవెంజర్స్ సీక్రెట్ వార్స్’. ఈ రెండు సినిమాల్లో ‘అవెంజర్స్ డూమ్స్ డే’ మూవీ 2026 మేలో రిలీజ్‌కు తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ మార్వెల్‌ సూపర్ హీరోల్లో ఐరన్‌మ్యాన్‌కు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్యారెక్టర్‌లో రాబర్ట్ డౌనీ జూనియర్ నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ నటుడు అవెంజర్స్ ఫ్రాంచైజీలో భాగం కాబోతున్నాడు.

అయితే ఐరన్ మ్యాన్ పాత్రలో నటించిన రాబర్ట్ డౌనీ ఈ సారి హీరోగా కాకుండా విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మార్వెల్ యూనివర్స్‌లో డాక్టర్ డూమ్ పాత్రను పోషిస్తున్నట్లుగా తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. సాన్ డియాగోలో రీసెంట్‌గా జరిగిన ఈవెంట్‌లో అతడు మాస్క్ పెట్టుకుని వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×