E-Paper
Advertisement

Pawan Kalyan: ఆ దర్శకుడితో పవన్ కల్యాణ్ సినిమా.. నిర్మాత క్లారిటీ.. కంగారు పడుతున్న ఫ్యాన్స్..!

Pawan Kalyan: ఆ దర్శకుడితో పవన్ కల్యాణ్ సినిమా.. నిర్మాత క్లారిటీ.. కంగారు పడుతున్న ఫ్యాన్స్..!
Advertisement

Pawan Kalyan and Surender Reddy new movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఆయన డిప్యూటీ సీఎం కాకముందు పలు సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ఓటీ, హరహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నీ సగం సగం షూటింగ్ జరుపుకుని ఉన్నవే. ఇక వీటికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని అటు పవర్ స్టార్ అభిమానులు, ఇటు మూవీ టీం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో మరో కొత్త సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

గతంలో అంటే 2020లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాపై తాజాగా నిర్మాత రామ్ తళ్లూరి క్లారిటీ ఇచ్చారు. విశ్వక్ సేన్ నటిస్తున్న ‘మెకానిక్ రాకీ’ టీజర్ లాంట్ ఈవెంట్ ఇవాళ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో నిర్మాత రామ్ తళ్లూరి మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగానే పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Advertisement

Also Read:  మాస్ కా దాస్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ రిలీజ్.. కార్ ఛేజింగ్ హైలైట్..!

ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి, పవన్ కల్యాణ్ కాంబో గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఆయన.. తమవైపు స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయని.. పూజా కార్యక్రమం కూడా అయిపోయిందని తెలిపాడు. సినిమా అంతా పవన్ కల్యాణ్ చేతుల్లోనే ఉందని అన్నాడు. మరి ఈ మధ్య పవన్ కల్యాణ్‌ను కలిశారా అనే ప్రశ్నకు.. 1 వీక్ బ్యాక్ కలిశానని అన్నాడు. అయితే వీలు చూసుకుని తమ సినిమాతో పాటు పెండింగ్‌లో ఉన్న సినిమాలు చేయొచ్చని నిర్మాత రామ్ అట్లూరి చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

తమ అభిమాన హీరో నుంచి మరో సినిమా వస్తుందంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే మరో పక్క కంగారు పడుతున్నారు. ఎందుకంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఈ మూవీతో అక్కినేని అఖిల్ మంచి కంబ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాతో అఖిల్ మరో సినిమా తీయకుండా అయిపోయాడు. దీని కారణంగానే ఇప్పుడు పవన్‌తో సినిమా అంటే కాస్త కంగారు పడుతున్నారు. చూడాలి మరి దర్శకుడు సురేందర్ రెడ్డి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×