BigTV English
Advertisement

Actress : యాడ్ షూట్ లో డర్టీ పనులు… స్టార్ హీరో అసభ్యకరంగా తాకాడంటూ హీరోయిన్ ఆరోపణలు

Actress : యాడ్ షూట్ లో డర్టీ పనులు… స్టార్ హీరో అసభ్యకరంగా తాకాడంటూ హీరోయిన్ ఆరోపణలు

Actress : సౌత్ ను లైంగిక వేధింపుల ఆరోపణలు ఊపేస్తున్న తరుణంలో తాజాగా హిందీ చిత్రపరిశ్రమలో ఓ నటి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆమె ఏకంగా ఒక సూపర్ స్టార్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారు అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.


యాడ్ షూట్ లో డర్టీ పనులు 

ప్రముఖ హిందీ టెలివిజన్ నటి షామా సికిందర్ ఇటీవల ఒక యాడ్ షూట్ సమయంలో జరిగిన ఒక అసౌకర్యమైన సంఘటనను వెల్లడించారు. ఒక ప్రముఖ నటుడు ఇంప్రూవైజ్ చేస్తున్నప్పుడు ఊహించని విధంగా తనను హగ్ చేసుకున్నాడని వెల్లడించింది. పైగా ఆమె ఆ టైమ్ లో అనారోగ్యంతో బాధ పడుతుందట. సదరు నటుడి అనుచిత ప్రవర్తన కారణంగా సికిందర్ భవిష్యత్తులో అతనితో కలిసి పని చేయకూడదని నిర్ణయించుకుందట.


ఆ కమర్షియల్ షూట్ గురించి ఇంటర్వ్యూలో ‘నన్ను కౌగిలించుకోవడం మొదట్లో షూట్‌లో భాగం కాదు’ అని షామా సికందర్ చెప్పారు. షామా మాట్లాడుతూ ‘కావాలనే అతను నన్ను కౌగిలించుకోవాలనుకున్నాడు’ అని చెప్పుకొచ్చింది. “కొన్నిసార్లు అవతలి వాళ్ళ ఉద్దేశం సరిగ్గా లేదనే విషయం ఈజీగానే అర్థం అవుతుంది. కాబట్టి అతను నాతో షూటింగ్ చేస్తున్నప్పుడు దానిని ఇంప్రూవైజ్ చేసాడు. ఆ టైమ్ లో అతను తన భార్యకు నగలు వేస్తానని చెప్పాడు. తరువాత అతను ఆమెను తిప్పి కౌగిలించుకుంటాడట. కాబట్టి అతను అదే విధంగా నన్ను కౌగిలించుకోవడంతో నాకు ఇంతకుముందెన్నడూ కలగని ఫీలింగ్ కలిగింది. నేను చాలా మంది వ్యక్తులతో పని చేసాను. ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళు తాకినప్పుడు ఎన్నడూ అలాంటి ఫీలింగ్ కలగలేదు. అతను చేసిన పనితో నేను షాక్ అయ్యాను. నిజానికి అతనొక సూపర్ స్టార్. కానీ ఇలాంటి పని చేశాడు. అందుకే జీవితంలో అతనితో కలిసి పని చేయవద్దు” అని డిసైడ్ అయ్యాను అని చెప్పింది.

Shama Sikander: Shama Wreaks Havoc Not Only In Bikini But Also In Saree,  You Will Be Stunned To See Her Boldness | बिकिनी ही नहीं साड़ी में भी कहर  ढाती शमा सिकंदर,

సినిమాలో నుంచి తీసిపారేశారు 

అదే ఇంటర్వ్యూలో షామా సికందర్‌ను బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి అడిగారు. అయితే ఒక సినిమా షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటుండగా ఎదురైన సంఘటనను వివరించింది షామా. అనుకోకుండా షూట్ రద్దు అయినట్టు షామాకు సమాచారం అందిందట. దీంతో ఆమె సెట్ నుండి వెళ్లిపోతున్నప్పుడు అసలు నిజం తెలిసిందట. ఆ సమయంలో తాను ఒక పెద్ద స్టార్‌తో పని చేస్తున్నానని షామా చెప్పింది. తాను వెళ్లే సమయంలో దర్శకుడు తన పాత్రకు వేరొకరిని పెట్టుకున్నానని చెప్పాడని చెప్పింది. ఆ తర్వాత రాత్రంతా దాన్ని తలచుకుని ఏడ్చేశానని వెల్లడించింది. నటీనటులను అకస్మాత్తుగా ప్రాజెక్ట్‌ల నుండి తొలగించడం చిత్ర పరిశ్రమలో సాధారణం అని షామా వివరించారు.

షామా చేసిన సినిమాలు 

షామా సికిందర్ ప్రముఖ మోడల్, నటి. హిందీలో ఆమె యే మేరీ లైఫ్ హై, సీఐడీ, బట్లీవాలా హౌస్ నెం. 43, కాజ్జల్, సెవెన్, బాల్ వీర్ జండ్ మాన్ మే హై విశ్వాస్ వంటి టీవీ షోలలో ప్రధాన పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందారు. ఆమె సెక్సాహోలిక్, మినీ-సిరీస్ మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్ వంటి వెబ్ షోలలో కూడా నటించింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×